విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ప్రతి సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమము జరుగుతుందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ. ఏ. ఎస్. తెలిపారు. 13.09.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, మూడు సర్కిల్ కార్యాలయములలో “స్పందన ” కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలిపారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …