Breaking News

నవాబ్‌పాలెం స్టేషన్‌ వద్ద పొడవైన లూప్‌ లైన్‌ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే…

-సరుకు రవాణా సులభతరానికి మరియు అధిక వ్యాగన్లతో నడిచే గూడ్స్‌ రైళ్లు నిలపడానికి తోడ్పడుతుంది
-ఇది జోన్‌లో రెండవ పొడవైన లూప్‌ లైన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైళ్ల రవాణాలో సౌలభ్యం, రద్దీ నివారణకు మరియు అదనపు వ్యాగన్లతో సుదూరం ప్రయణించే గూడ్స్‌ రైళ్లు నిలపడం వంటి సౌకర్యాల కోసం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని విజయవాడ`విశాఖపట్నం సెక్షన్‌ గ్రాండ్‌ ట్రంక్‌ మార్గంలో ఉన్న నవాబ్‌పాలెం రైల్వే స్టేషన్‌ వద్ద పొడవైన లూప్‌ లైన్‌ను ప్రారంభించింది. ఇది జోన్‌లో నిర్మించిన రెండవ పొడవైన లూప్‌ లైన్‌. మొదటిది గతంలో బిక్కవోలు స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేశారు. రైల్వేలలో ఎక్కువ రైళ్లను నిలపడానికి మరియు రైళ్ల రాకపోకలను సులభతరం చేయడానికి స్టేషన్లలో లూప్‌ లైన్లను నిర్మిస్తారు. సాధారణంగా ఈ లూప్‌లైన్లను బహుళ ఇంజన్లతో సహా పూర్తి సామర్థ్యం గల గూడ్స్‌ రౖెెళ్లను నిలిపేలా 750 మీటర్ల పొడువు ఉండేలా నిర్మిస్తారు. ఒకే సారి భారీ పరిమాణంలో సరుకులను రవాణా చేయడం, సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో వ్యాగన్లు ఉండే పొడవాటి రైళ్లను నిర్వహించడం వంటి అవసరాలకు ఇవి సరిపోవు. ఈ సమస్య పరిష్కారానికి దాదాపు 1500 మీటర్ల గల (ఇది ప్రస్తుత లూప్‌ లైన్‌ పొడవుకు రెండిరతలు) పొడవైన లూప్‌ లైన్లను నిర్మించేలా భారతీయ రైల్వే చర్యలు తీసుకుంటోంది. పొడవైన లూప్‌ లైన్ల ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ విజయవాడ డివిజన్‌లోని విజయవాడ`విశాఖపట్నం సెక్షన్‌లో బిక్కవోలు, నవాబ్‌పాలెం మరియు ఎలమంచిలి స్టేషన్లలో, విజయవాడ`చెన్నై సెక్షన్‌లోని నిడుబ్రోలు, అమ్మనబ్రోలు మరియు బిట్రగుంట స్టేషన్లు మొత్తం ఆరు స్టేషన్లలో పొడవైన లూప్‌ లైన్ల నిర్మాణానికి అనుమతించింది. వీటిలో ప్రస్తుతం బిక్కవోలు మరియు నవాబ్‌పాలెం స్టేషన్ల వద్ద రెండు పొడవైన లూప్‌ లైన్లు ప్రారంభించబడ్డాయి. మిగిలిన ప్రాంతాలలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
నవాబ్‌పాలెం స్టేషన్‌ వద్ద పొడవైన లూప్‌ లైన్‌ ముఖ్యాంశాలు :
-70 రూట్లతో ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టం ఏర్పాటు
-నవాబ్‌పాలెం-తాడేపల్లిగూడెం మరియు నవాబ్‌పాలెం-నిడదవోలు సెక్షన్లలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్‌ బ్లాక్‌ సిగ్నల్స్‌ కోసం ఆధునిక యాక్సెల్‌ కౌంటర్ల ఏర్పాటు.
-ఆధునిక పరికరాలతో సెంట్రల్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టం, డేటా లాగర్స్‌ ఏర్పాటు.
-భద్రత పెంపు కోసం ఆగ్నిమాపక అలారం వసతి ఏర్పాటు.
-షెడ్యూల్‌ ప్రకారం 9 రోజులలో పూర్తి కావాల్సిన ఎన్‌ఐ పనులు ఖచ్చితమైన ప్రణాళికతో ఏడు రోజులలో పూర్తయ్యాయి.
-పని వేగవంతం కోసం పని ప్రదేశంలో రెండు సెట్ల యూనిమ్యాట్‌ యంత్రాలు మరియు టీ`28 క్రేన్లు వినియోగించబడినాయి.
-ఓహెచ్‌ఈ బ్లాకుల వసతికి మెయిన్‌ లైన్‌ మరియు లూప్‌ లైన్లలో విడివిడిగా సెక్షన్లు ఏర్పాటు చేయబడ్డాయి.
ప్రయోజనాలు :
-రెండు గూడ్స్‌ రైళ్లను కలిపి ఒకే గూడ్స్‌ రైలుగా నడుపబడే జై కిసాన్‌ స్పెషల్‌ వంటి ఎక్కువ వ్యాగన్లు గల రైళ్లను నిలపడానికి, త్వరగా గమ్యస్థానం చేరడానికి ఉపయోగపడుతుంది.
-రైళ్ల క్రాసింగ్‌ సదుపాయంతో పాటు, గూడ్స్‌ రైళ్లు ఎక్కువ సేపు నిరీక్షించకుండా, రైళ్లను వేగంగా నడిపే వీలు కలుగుతుంది.
-గూడ్స్‌ రైళ్లను మెయిన్‌ లైన్‌లో ఎక్కువ సమయం నిలుపుదల కాకుండా తప్పించడంతో ప్యాసింజర్‌ రైళ్లను వేగంగా నడిపే వీలు కలుగుతుంది.
-రైళ్ల నిర్వహణ మెరుగవుతుంది.
-వ్యాగన్లను సమర్థంగా ఉపయోగించడం మరియు ప్రయాణ ఖర్చు కూడా తగ్గుతుంది.
-అధిక సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది.
అంకిత భావంతో కృషి చేసి జోన్‌లో రెండవ పొడవైన లూప్‌ లైన్‌ పనులు పూర్తి చేసిన విజయవాడ డివిజన్‌ అధికారులను మరియు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ మాల్య అభినందించారు. రద్దీ ట్రంక్‌ మార్గం సెక్షన్‌లో గూడ్స్‌ రైళ్ల నిర్వహణలో మరింత అభివృద్ధికి మిగిలిన ప్రాంతాలలో పొడవైన లూప్‌ లైన్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *