కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో చేపట్టిన పనులకు సంబంధించి కోర్ట్ వారి ఉత్తర్వుల మేరకు జరపాల్సిన చెల్లింపులకై నిర్వహించిన అత్యవసర సమావేశం కోరం సభ్యులు లేక వాయిదా వేస్తున్నట్లు కొవ్వూరు పురపాలక సంఘం మొదటి వైస్ ఛైర్ పర్సన్ మన్నే పద్మ ప్రకటించారు. మంగళవారం కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిల్ అత్యవసర సమావేశానికి మొదటి వైస్ ఛైర్ పర్సన్ మన్నే పద్మ అధ్యక్షత వహించారు. కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలో గతంలో చేపట్టిన 14 పనులకు రూ. 5 కోట్ల 89 లక్షల మేర బకాయిలు చెల్లింపు సంబంధించి మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించగా, ఆమోదించడానికి అవసరమైన సభ్యులు లేకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు కౌన్సిల్ కు అధ్యక్షత వహించిన వైస్ ఛైర్మన్ మన్నే పద్మ ప్రకటించారు. తదుపరి సమావేశం తేదీని ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.
Tags kovvuru
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …