విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ – 19 నియంత్రణ చర్యల్లో భాగంగా కోవిడ్ నిబంధనలు పాటించని షాపులు, మాల్స్, వంటి సంస్థల పై కచ్చితంగా అపరాధరుసుం విధించాలని అవసరమైతే షాపు సీజ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని అదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కోవిడ్-19 ఎన్ఫోర్స్మెంట్ 15 బృందాల సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 నిబంధనలు కచ్చితంగా క్షేత్రస్థాయిలో అమలు అయ్యేలా పర్యవేక్షించేందుకు నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రతీ రోజు తనిఖీలు చేయాలన్నారు. ప్రతీ రోజు వేసిన అపరాధరుసుం అదేరోజుకాని తదుపరి రోజు కాని విఎంసి కార్యాలయం నందు సంబంధిత శానిటరీ సెక్రటరీ జమ చేయాలన్నారు. ఆ చలనా ప్రతిని వాట్సప్ గ్రూప్ లో పోస్టు చేయాలన్నారు. ప్రతీ ఎన్ఫోర్స్మెంట్ బృందం తనిఖీ చేసే విధానాన్ని తాము ఏరోజైన పరిశీలించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ స్పష్టం చేశారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఇ కృష్ణవర్మ, రెవెన్యూ సిబ్బంది, శానిటరీ సెక్రటరీలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …