విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో యువతకు ఓటు హక్కు పై అవగాహన పెంచడంతో పాటు 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు జూనియర్, డిగ్రీ కళాశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు.
బుధవారం ప్రత్యేక ఓటర్ల జాబిత సవరణ కార్యక్రమంపై రిటర్నింగ్ అధికారులు, ఏఐఆర్వోలు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో ఏపి ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ
ఈ వీడియోకాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జె. నివా’ పాటు జెసి ఆసరా కె. మోహన కుమార్, డిఆర్ వో యం. వెంకటేశ్వర్లు హాజరైయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటర్ల జాబిత సవరణ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని ఇందులో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. 2022 జనవరి 5వ తేదిన తుది ఓటర్ల జాబిత ప్రకటించేందుకు అవసరమైన కార్యచరణ పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రస్తుతం బిఎల్‌ఓలుగా ఉన్న అంగనవాడి కార్యకర్తల స్థానంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నవంబరు 1వ తేదీన సమీకృత ముసాయిదా ఓటర్ల జాబిత ప్రకటించాలని, నవంబరు 1 నుంచి 30వ తేది వరకు ఓటర్ నమోదు, అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. నవంబరు 20,21 తేదీలో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. డిశంబరు 20 తేది లోపు ఓటర్ నమోదు క్లయిమ్ లు, అభ్యంతరాలను పరిష్కరించాలన్నారు. 2022 జనవరి 5వ తేదిన తుది ఓటర్ల జాబిత ప్రకటించాలన్నారు. 1500 మించి ఓటర్లు కలిగిన పోలింగ్ స్టేషన్లను విభజించాలన్నారు. పోలింగ్ కేంద్రాలు చేర్పులు, మార్పులకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అక్టోబరు 5 నాటికి ఇంటింటికి బూత్ స్థాయి అధికారులు వెళ్లి పరిశీలించాలన్నారు. బిఎల్‌ఓలు విధిగా సందర్శించి గరుడ యాప్ లో పొందుపరచాలన్నారు.
ఈ సందర్భంగా జె. నివాస్ మాట్లాడుతూ జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ఓటర్లగా నమోదు చేసేందుకు ఆయా కళాశాలల్లోనే ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామన్నారు. . జిల్లాలో ప్రస్తుతం 36,53,157 మంది ఓటర్లగా నమోదు అయి ఉండగా వారిలో పురుషులు 17,94,199 మంది, మహిళలు 18,58,683 మంది ఉన్నారన్నారు. జిల్లాలో 4051 పోలింగ్ స్టేషన్లు వుండగా 244 బూత్ లెవెల్ ఆఫీసర్ల మార్పుకు ప్రతిపాధించడం జరిగిందన్నారు. రెండు నియోజకవర్గల్లో ఇఆర్ ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇందుకు ప్రత్న్యామయ చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం పారం- 6, 7, 8, 8ఏ కింద 3,910 క్లయిమ్ లను పెండింగ్ లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కారిస్తామన్నారు. అలాగే 1500 ఓటర్లకు మించి ఉన్న పోలింగ్ స్టేషన్లకు కొత్తగా పోలింగ్ స్టేషన్లు గుర్తిస్తామన్నారు. అలాగే అవసరాలను బట్టి పోలింగ్ స్టేషన్ల మార్పును కూడా చేపడతామన్నారు. ర్యాంప్, టాయిలేట్లు, త్రాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు ఉన్న పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జె. నివాన్ జిల్లాలోని ఇఆర్టలు, ఎంఆర్ఓలతో ఓటర్ల జాబిత సవరణ కార్యక్రమంపై సమీక్షించారు.
ఈ సమావేశంలో జడ్పి సీబఓ ఏఎస్ఎస్ సూర్యప్రకాశరావు, డిఆర్డీఏ పిడి యం. శ్రీనివాస్ రావు, డ్వామా పిడి జీవి. సూర్యనారాయణ, మచిలీపట్నం ఆర్డీవో ఎన్.ఎస్.కె, ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …