మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి బుధవారం బందరు మండలం హు స్పె లెం మరియు సుల్తానగరం గ్రామాల్లో తహసిల్దారుతో కలసి రైస్ మిల్లులు తనిఖీ చేశారు. ఆయా మిల్లులలో స్టాక్ రిజిష్టర్లతో పాటు సంబంధిత రికార్డులు ఆర్ డివో తనిఖీ చేశారు. పార్టెక్స్ బియ్యంలో నాన్ సార్టెక్స్ రైస్ కలుపుతున్నారనే విమర్శనాత్మక వార్తాంశాలు వస్తున్న నేపద్యంలో ఈ తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. డివిజన్లో అన్ని మండలాల్లో రైస్ మిల్లులు తనిఖీలు చేయడం జరుగుతుందని ఎక్కడైన అక్రమాలకు పాల్పడిన లేదా పిడిఎస్ రైస్ దొరికిన అట్టి వారిపై 63 కేసులు మరియు క్రిమినల్ కేసులు తప్పని సరిగా నమోదు చేయడం జరుగుతుందన్నారు. బందరు మండల తహసిల్దారు డి. సునీల్ బాబు, సివిల్ సప్లయిస్ సిబ్బంది ఆర్ డివో వెంట ఉన్నారు.
Tags machilipatnam
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …