Breaking News

దిశ బిల్లు మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచింది…

-బాదిత మహిళలకు సత్వర న్యాయం అందజేయడంలో దోహదపడుతున్నది
-ఆపద సమయాల్లో మహిళలకు తక్షణమే రక్షణ కల్పిస్తున్న దిశ యాప్
-దిశ బిల్లు చట్ట రూపం దాల్చకపోయినా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది
-ప్రతిపక్ష నాయకులు బిల్లును చించివేయడం మహిళలను అవమానించినట్లే

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దిశ బిల్లు చట్ట రూపం దాల్చకపోయినా మహిళల్లో ఆత్మస్థైర్యాన్నిపెంపొందించేందుకు ఎంతగానో దోహదపడుతున్నదని, అటు వంటి బిల్లును ప్రతిపక్ష నాయకులు చింపివేయడం మహిళలను అవమానించడంతో సమానమని రాష్ట్ర మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం సచివాలయం బ్లాన్ నెం.4 లోని పబ్లిసిటీ సెల్లో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ దిశ బిల్లు, దిశ యాప్ వల్ల రాష్ట్రంలోని మహిళకు తక్షణమే అందుతున్న న్యాయం, రక్షణ అంశాలను వివరించారు. తెలంగాణా రాష్ట్రంలో ఒక మహిళకు జరిగిన అన్యాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎంతగానో చలించిపోయారని, అటు వంటి అన్యాయం రాష్ట్రంలోని మహిళకు జరుగకూడదని భావించి దిశ బిల్లును ప్రతిపాదించారన్నారు. రాష్ట్రంలోని మహిళల భద్రతకు, రక్షణకు అధిక ప్రాధాన్యత నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లును ప్రతిపాదించడం జరిగిందన్నారు. రాష్ట్ర కేబినెట్, శాసన సభ, శాసన మండలి ఆమోదంతో దిశ బిల్లును కేంద్రం ఆమోదానికి పంపడం జరిగిందని, అయితే ఆ బిల్లుపై కేంద్రం ఇంతవరకూ ఆమోద ముద్రవేయకపోవడం వల్ల చట్ట రూపం దాల్చలేదన్నారు. అయితే ఆ బిల్లు వల్ల మహిళల్లో అవగాహన, ఆత్మస్థైర్యం పెరిగాయని, ఫలితంగా ఏ మాత్రం అన్యాయం జరిగినా వెంటనే బయటకి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని నిర్బయంగా వ్యక్తంచేస్తున్నారన్నారు. ఫలితంగా కేసుల నమోదు శాతం పెరగడమే కాకుండా తక్షణమే బాదిత మహిళకు ప్రభుత్వ పరంగా న్యాయం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇటు వంటి పరిస్థితులు గతంలో లేవని, దిశ బిల్లు, దిశ యాప్ వల్లనే మహిళల్లో చైతన్యం పెరిగిందన్నారు. మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలు ఈ బిల్లును ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రాల్లో కూడా అమలుకు సిద్దం అవుతున్నాయన్నారు. అటు వంటి బిల్లును ప్రతిపక్ష నాయకులు అవమానించడం, బిల్లు కాపీలను చించివేయడం ఎంతో విచారించ దగ్గ విషయమని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
గతంలో మహిళలపై జరిగే అత్యాచార కేసు విచారణకు సుమారు మూడు నుండి నాలుగు మాసాలు సమయం పట్టేదని, అయితే 2019 లో 100 రోజులు, 2020 లో 86 రోజులు, 2021 లో 42 రోజుల్లోనే విచారణ పూర్తిచేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దిశ బిల్లు చట్ట రూపం దాల్చకపోయినా దాని స్పూర్తితో రాష్ట్రంలోని మహిళలకు ఎంతగానో న్యాయం జరుగుచున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేష్లను,3 ఫోరెన్సిక్ ల్యాబ్ లు, ఫాస్టు ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు డి.ఎస్.పి. స్థాయి అధికారులను, సిబ్బందిని నియమించినట్లు ఆమె తెలిపారు. 2,114 కేసులకు సంబందించి కేవలం 15 రోజుల్లోనే చార్జి షీట్లు దాఖలు చేయడం జరిగిందన్నారు. 2 లక్షల 11 వేల మంది లైంగిక నేరస్తుల వివరాలను సేకరించి, వాటిని జియో ట్యాగింగ్ చేయడం జరిగిందన్నారు. మహిళలపై దాడిచేసిన 148 మందికి పలు రకాల శిక్షలు విధించడంతో పాటు వారిలో ముగ్గురికి ఉరిశిక్ష, 17 మందికి జీవిత ఖైదు, ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష, 10 మందికి పదేళ్లు జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు.
అదే విధంగా దిశ యాప్ ను కూడా సుమారు 39 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని, ఆ యాప్ మహిళ రక్షణకు, భద్రతకు ఎంతగానో ఉపయోగ పడుతున్నట్లు ఆమె తెలిపారు. పురుషులు కూడా ఈ యాప్ ను తమ స్మార్టు ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుని తమ కుటుంబ సభ్యులు రక్షణకు దోహదపడాలని ఆమె విజ్ఞప్తిచేశారు. కడపకు చెందిన ఒక మహిళ డిల్లీ వెళ్లి అక్కడ ఆటోలో వెళుతుండగా ఆటో డ్రైవర్ ఆమెను ఇబ్బంది పెట్టడంతో దిశ యాప్ ను ఉపయోగించుకుని తక్షణమే రక్షణను పొందిందని, ఇది దిశ యాప్ వల్లనే సాద్యమైందని ఆమె తెలిపారు. వైద్యం, ఆహారం, ఇతర సహాయాల నిమిత్తం బాదిత మహిళలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇటు వంటి పరిస్థితలు గతంలో లేవని, కోర్టులు ఆదేశించినా సరే గత ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో అలసత్వాన్ని ప్రదర్శించడం జరిగిందని, అటు వంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో లేవని ఆమె స్పష్టంచేశారు.
(ప్రచార విభాగం సమాచార, పౌర సంబంధాల శాఖ అమరావతి సచివాలయం వారిచే జారీ చేయడమైనది)

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *