నూజివీడు. నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలనను రాష్ర ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక సిద్దార్థ నగర్ లో అధికార్లతో కలిసి స్థల పరిశీలన, తదితర అంశాలను పరిశీలించి ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ నూజివీడు శాసనసభ్యులు విజ్ఞప్తి మేరకు నూజివీడు ప్రాంతంలో 250 కోట్ల రూపాయలతో 26 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ (ఫ్రూట్ ప్రాసెసింగ్ ) యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని , పరిశ్రమ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, అనుకూలంగా ఉందన్నారు. ఇతర అంశాలను కూడా పరిశీలించి సవివరమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని మీనా చెప్పారు. కృష్ణా జిల్లాలో 75 వేల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయని, వీటిలో ప్రధానంగా మామిడి, జామ పంటలున్నాయన్నారు. నూజివీడు ప్రాంతంలో మామిడి, జామ పంటలు అధికంగా పండుతాయని, ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ (ఫ్రూట్ ప్రాసెసింగ్ ) యూనిట్ నెలకొల్పడం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
కార్యదర్శి వెంట ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సి.ఈ.ఓ ఎల్. శ్రీధర్ రెడ్డి, రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి, ఉద్యానవనాలు శాఖ డిప్యూటీ డైరెక్టర్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఈ.డి. పి..వి.ఎస్. రవికుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags nuzividu
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …