విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఇళ్ల గ్రౌండింగ్ నూరు శాతం పూర్తవ్వాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికార్లను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి బుధవారం సాయంత్రం పామర్రు, నూజివీడు, తిరువూరు నియోజకవర్గాలలో జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిని మండల స్థాయి అధికార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న ఇళ్ల లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక, సబ్సిడీ పై సిమెంట్, ఐరన్ అందిస్తున్నదని, డ్వాక్రా మహిళలకు అదనపు ఆర్ధిక సహాయంగా బ్యాంకుల నుండి రుణాలను కూడా అందిస్తున్నామన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను లబ్దిదారులకు తెలియజేసి, వారు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఇళ్ల నిర్మాణ సమయంలో నీటి సౌకర్యం అవసరమని, కాలనీలో ఇళ్ల సంఖ్యాననుసరించి అవసరమైన నీటి సౌకర్యం కల్పించేందుకు అధికారులు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న ఇళ్ల కాలనీలలో విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను గృహనిర్మాణ శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లైతే వెంటనే పరిష్కరిస్తారని, ఈ విషయంపై లబ్దిదారులకు అవగాహన కలిగించాలన్నారు. లబ్ధిదారుల సమస్యల పరిష్కారంలో విఫలమైన అధికారులపై చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (గృహ నిర్మాణం ) శ్రీమతి నుపూర్ శ్రీనివాస్ అజయ్ కుమార్, గృహ నిర్మాణ శాఖ పి .డి రామచంద్రన్, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, గృహనిర్మాణ శాఖ అధికారులు, ఇంజినీర్లు, ప్రభృతులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …