విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తుమ్మలపల్లి వారి కళా క్షేత్రం వద్ద ప్రజారోగ్య శాఖా ఏర్పాటు చేసిన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పాల్గొన్నారు. నగరంలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా నివాసాల నుండి చెత్త సేకరణకై సుమారు 50 లక్షల విలువలతో నూతనంగా కొనుగోలు చేసిన 500 వీల్ బేరర్స్ లను ప్రారంభించి మైక్రో పాకెట్ ఆధారంగా డివిజన్ లలోని పారిశుధ్య సిబ్బందికి అందించారు. ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణ విధానమును మెరుగుపరచుటలో భాగంగా చెత్త సేకరణకు ఈ తోపుడు బండ్ల కొనుగోలు చేయుట జరిగిందని పేర్కొన్నారు. డివిజన్ లో ప్రతి ఇంటి నుండి తడి మరియు పొడి చెత్తలను వేరువేరుగా సేకరించాలని అన్నారు. ఈ కార్యక్రమములో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …