కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలచే ఎన్నుకోబడి ప్రజా ప్రతినిధులకి వారి అధికారాలపై స్పష్టమైన వైఖరి , అవగాహన ఉండాలని ఎంపీడీఓ పి. జగదాంబ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల లో కొవ్వూరు మండలం పరిధిలోని ఉపసర్పంచ్‌లు, వార్డుసభ్యులకుమాస్టర్ ట్రైనర్స్ తో రెండవ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జగదాంబ మాట్లాడుతూ, రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అధికారాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆయా గ్రామ పంచాయతీ లను ఏవిధంగా అభివృద్ధి చేసుకోగలమో తెలియచెయ్యడం జరిగిందన్నారు.
తొలిదశ శిక్షణా తరగతులను మద్దూరు లంక, నందమూరు, తోగుమ్మి, వాడపల్లి, సీతంపేట, పసివేదల, పెనకన మెట్ట,వేములూరు గ్రామ పంచాయతీ ల 92 మంది వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించారు.
కొవ్వూరు మండల పరిధిలో ని మిగిలిన గ్రామ పంచాయతీ లైన అరికిరేవుల, చిడిపి, ధర్మవరం, దొమ్మేరు, ఐ. పంగిడి, కాపవరం, కుమారదేవరం, మద్దూరు గ్రామ పంచాయతీ లకు చెందిన 98 మందికి (ఉప సర్పంచ్ లకు , వార్డు సభ్యుల కు) అక్టోబర్ 5, 6 తారీఖుల్లో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఎంపిడిఓ పి.జగదాంబ తెలిపారు. ఈ రెండు రోజుల శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోని ప్రజలకు మెరుగైన పౌర సేవలను మరింతగా అందించాలని మాస్టర్ శిక్షకులు విజ్ఞప్తి చేశారు. ఉప సర్పంచ్ ల, వార్డు సభ్యుల విధి విధానాలపై రూపొందించిన మెటీరియల్ ను శిక్షణ కార్యక్రమానికి హాజరైన వారికి అందచేశారు.