ఈ సందర్బంలో కమిషనర్ మాట్లాడుతూ 29వ తేది సెప్టెంబర్ నుండి 3వ తేది అక్టోబర్ వరకు పలు కార్యక్రమములు నిర్వహిస్తున్నట్లు అయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 29వ తేది నుండి అక్టోబర్ 2వ తేదిలలో స్వచ్చ్ సర్వేక్షన్ సాలిడ్ వేస్ట్ మెనేజ్మెంట్ కార్యక్రమములో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా 02-10-2021 తేది 12.00 గంటలకు NRP రోడ్ సత్యనారాయణపురం నందు Placemaking, సాయంత్రం గ.05-00 లకు గాంధీజీ పర్వతముపై చిల్ద్రెన్ ప్లే జోన్ ను ప్రారoభిస్తున్నట్లు అయన వివరించారు.
03-10-2021 తేదిన బెంజి సర్కిల్ వద్ద ఉదయం 6.30 నిలకు Cycle for Freedom, ఉదయం 6.45 నిలకు Walk for Freedom పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద మరియు ఉదయం 9.00 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు Children Art Carnival కార్యక్రమములు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమములలో 7 నుండి 75 సంవత్సరాలు వయస్సు లోపు వారందరూ పాల్గోనవచ్చునని, కార్యక్రమములో పాల్గొను వారు QR కోడ్ స్కాన్ చేసుకొని తమ యొక్క పేర్లను నమోదు చేసుకోనవచున్నని మరియు స్పాట్ రిజిస్టేషన్ సౌకర్యం కుడా ఏర్పాటు చేసిన్నట్లు వివరించారు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా-ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్ పోస్టర్ ఆవిష్కరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా-ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్ (Govt of India – Azadi Ka Amrit Mahotsav) లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమములకు సంబంధించిన పోస్టర్ ను నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ డిప్యూటీ మేయర్లు మరియు అధికారులతో కలసి ఆవిష్కరించారు.