-భక్తి పారవశ్యానికి లోనైన భక్తులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భక్తులను అనుగ్రహించేందుకు భగవంతుడు అనేక రూపాలలో దర్శన భాగ్యం కలుగ చేస్తూ ఉంటారు. విజయవాడ రూరల్ మురళి నగర్ గ్రామంలో గురువారం ఉదయం హవనం నిర్వహించగా అద్భుత రూపం భక్తులకు దర్శనమిచ్చింది.బ్రహ్మశ్రీ మావుడురు సతీష్ కుమార్ శర్మ,రవీంద్ర కుమార్ శర్మ ల ఆధ్వర్యం లో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన హోమంలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పరిచే విధంగా ఒక క్షణం పాటు కాలభైరవ దర్శనం భక్తులందరికీ కలిగింది. హోమం నిర్వహిస్తున్న రుత్వికులు సైతం అమిత ఆనందం తో పాటు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే హోమంనిర్వహిస్తున్నారు రుత్వికులు లో కొందరు తన చేతిలో ఉన్న చరవాణి లో ఈ దృశ్యాన్ని బంధించారు. అత్యంత అరుదైన ఈ దృశ్యాన్ని చూసేందుకు మిగతా భక్తులతో పాటు నిర్వాహకులు ఉత్సాహం చూపించారు. కాలభైరవ దర్శనం తో తమ జన్మ ధన్యమైంది అంటూ భక్తులు భక్తిపారవశ్యం లకు లోనయ్యారు. ఈ హఠాత్ పరిణామంతో ఆ ప్రాంతం అంతా కొంతసేపు సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమం లో ఋత్విక్కులు రంగావఝ్యల సత్యనారాయణ ప్రసాద్ ,లక్ష్మీనారాయణ, మల్లికార్జున్ ,తదితరులు పాల్గొన్నారు.