అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్నశాశ్వత భూహక్కు-భూరక్ష పై సచివాలయంలో గురువారం మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం పాల్గొన్నారు.
సమీక్ష సందర్భంగా సర్వే కార్యక్రమం పై అధికారులు మంత్రులకు వివరించారు. సెప్టెంబర్ 13వ తేదీ నాటికి 815 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయ్యిందని అధికారులు వివరించారు. 363 గ్రామాల్లో మ్యాప్‌ల రూపకల్పన పూర్తయ్యిందని తెలిపారు. 279 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయ్యిందని, మరో 84 గ్రామాల్లో పనులు పురోగతిలో ఉన్నాయన్న అధికారులు తెలిపారు. 77,33,825 హౌస్‌హోల్డ్ రికార్డులకు గానూ 74,99.508 ఇళ్ళ రికార్డులను అప్‌డేట్ పూర్తి చేశామని అధికారులు వివరించారు. ఏడాదిలో డ్రోన్ సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద రాష్ట్రంలో సర్వే పనులు వేగవంతం చేయాలన్నారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సర్వే ప్రక్రియ సందర్భంగా అవసరమైన శిక్షణను ఎపి ఎస్‌ఐఆర్‌డి ద్వారా నిర్వహించాలని మంత్రులు సూచించారు. కొత్తగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్న మంత్రులు సూచించారు.
ఈ సమావేశంలో సిసిఎల్‌ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఉషారాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఐటి) జి.జయలక్ష్మి, పిఆర్&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్దార్థ్‌జైన్, ఇన్‌చార్జి డిఎంజి చంద్రశేఖర్‌రావు తదితరులు హాజరయ్యారు.