విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని ఉన్న 13952 హౌసింగ్ లబ్దిదారులకు జిల్లా నందు ఉన్న అన్ని బ్యాంక్స్ ద్వారా రుణాలు ఈ నెల 15వ తేది నాటికి మంజూరు చేయించాలని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ యం రమాదేవి సంబంధిత అధికారులకు సూచించారు. స్థానిక మెప్మా కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని 8 మునిసిపాలిటీలో పనిచేస్తున్న మెప్మా సిబ్బందితో వివిధ కార్యక్రమాల అమలు ప్రగతి పై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న కాలనీల లబ్దిదారులకు బెస్మెంట్ లెవెల్ లో గృహము కట్టకోవడానికి ప్రతీ ఒక్కరికి రూ. 50 వేలు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించేందుకు కృషి చేయాలన్నారు. బ్యాంక్ లింకేజి రుణాలు, స్వయం ఉపాధి పథకం వ్యక్తిగత, గ్రూపుల రుణాల అర్థసంవత్సర సాధన లక్ష్యాలను ఈ నెల మొదటి వారంలో సాధించాలన్నారు. రెండవ విడత వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలను ఈ నెల 8 నుంచి 17వరకు కోవిడ్ నిబంధలను పాటిస్తూ మునిసిపాలిటీలో విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. వైఎస్సార్ చేయుత లబ్దిదారులకు జియో టాగింగ్ ఇతర అంశాలకు సంబంధించి ఆన్లైన్ అప్ డేటింగ్ ను త్వరగా పూర్తి చేయాలన్నారు. జగనన్న తోడు, పియం స్వనిధి కింద వీధి విక్రయదారులకు రూ. 10 వేలు మంజూరు చేయించడంలో చొరవ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మెప్మా టెక్నికల్ నిపుణులు, సియంయంలు, సీఓలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …