విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర పర్యాటక శాఖ ఉన్నత అధికారులు జి .కమలవర్థన్ రావు , డైరెక్టర్ జనరల్ మరియు రుపేందర్ బ్రార్ , అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాబోయే 18th & 19th లో జరగనున్న సదరన్ టూరిజం మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటుల గురించి శుక్రవారం ఒక సమీక్షా సమావేశం వవీడియో కాన్ఫరెన్స” ద్వారా నిర్వహించారు. సత్యనారాయణ ఐ . ఏ. ఎస్., CEO APTA & MD APTDC ఈ సమావేశం లో పాల్గొన్నారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , తమిళనాడు , కేరళ , కర్ణాటక మరియు పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి పర్యాటక , సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రిలు ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉదేశ్యం పర్యాటక , సాంస్కృతిక , పురావస్తు శాఖల ను మెరుగు పరచడం , అభివృద్ధి కొరకు ప్రణాళికల గురించి చర్చించడం, రాష్ట్రాలు ఉమ్మడిగా పర్యాటకాన్ని ప్రోత్సాహించడం మరియు రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం ని మెరుగుపరచడం, కేంద్ర పర్యాటక శాఖ వారు పర్యాటక రంగం లో ఉన్న సమ్యసల గురించి కూడా చర్చించనున్నారు. ఈ సమావేశాన్ని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తున్నారు మరియు కర్ణాటక పర్యాటక శాఖ వారు ఆతిధ్యాన్ని ఇస్తున్నారు. ఈ సందర్భం లో సత్యనారాయణ ఐ . ఏ. ఎస్., CEO APTA & MD APTDC మాట్లాడుతూ ఈ సమావేశం లో పాల్గొనడం, మన రాష్ట్రం లో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి ఇతర రాష్ట్రాలకు తెలియపరచడం అనేది ఒక గౌరప్రద మైన అవకాశం. అలాగే ఇతర రాష్ట్రాల పర్యాటకం గురించి తెలుసుకోవడం , వాళ్ళు పర్యాటక రంగాన్ని పెంపొందించేందుకు అనుసరించే విధానాలను తెలుసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల పర్యాటక శాఖ లతో కలిసి రాష్ట్ర పర్యాటకాన్ని ప్రోత్సాహించేందుకు కూడా ఇది ఒక మంచి అవకాశం అని పేర్కొన్నారు.