-1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అర్జీల స్థితి తెలుసుకునే అవకాశం
-9552300009 వాట్సప్ గవర్నెన్స్ ‘మన మిత్రా’ యాప్ ద్వారా సమర్థవంతంగా పౌర సేవలు
-కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ 29 (సోమవారం) న తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా కలెక్టరేట్ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం” కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించ నున్నట్లు తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వాటికి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అర్జీదారులు తమ వినతులను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, నమోదు చేసిన అర్జీల పురోగతి మరియు స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్న పౌరులకు అనుకూల వసతులు కల్పించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాట్సప్ గవర్నెన్స్ – మన మిత్రా యాప్ ద్వారా పౌర సేవలు ప్రజలకు ప్రభుత్వ సేవలు, పౌర సేవలు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు 9552300009 వాట్సప్ గవర్నెన్స్ ‘మన మిత్రా’ యాప్ ద్వారా 36 ప్రభుత్వ శాఖలకు చెందిన 700 లకు పైగా పౌర సేవలు సమర్థవంతంగా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు ఈ సేవల ద్వారా సమాచారాన్ని పొందడంతో పాటు వివిధ సేవలను సులభంగా వినియోగించు కోవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యాలను ప్రజలు విస్తృతంగా ఉపయోగించుకొని ప్రభుత్వ సేవల ప్రయోజనాలను పొందాలని కలెక్టర్ కోరారు.
Prajavartha Online Telugu News