రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం – 1955 క్రింద 6-A కేసులలో స్వాధీనం చేసుకున్న 3335.8286 క్వింటాళ్ల ప్రజా పంపిణి (PDS) బియ్యంను నిబంధనల మేరకు బహిరంగ విధానంలో విక్రయించ నున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ / కలెక్టర్ (పౌర సరఫరాలు) వై. మేఘా స్వరూప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బియ్యం విక్రయానికి సంబంధించి తేది: 05.01.2026 న మధ్యాహ్నం 3.00 గంటలకు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు) గారి ఛాంబర్ వద్ద, సంబంధిత అధికారుల సమక్షంలో ప్రక్రియ నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రక్రియలో పాల్గొనదలచిన వారు తేది: 03.01.2026 న జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచిన PDS బియ్యం నమూనాలను పరిశీలించుకోవచ్చని మేఘా స్వరూప్ తెలిపారు..అలాగే, ఇందులో పాల్గొనే వారు నిర్ణీత నిబంధనల ప్రకారం రూ.50,000/- ధరావత్తు సొమ్మును చెల్లించి, నిర్దిష్ట నమూనాలో దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. తప్పనిసరిగా GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రతిని సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే 6-A కేసులు నమోదు అయి పెండింగ్లో ఉన్న వ్యక్తులు లేదా సంస్థలు ఈ ప్రక్రియలో పాల్గొనుటకు అనర్హులని జిల్లా జాయింట్ కలెక్టర్ స్పష్టంగా తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనలు, పారదర్శకతకు అనుగుణంగా ఈ విక్రయ ప్రక్రియ నిర్వహించ బడుతుందని ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News