Breaking News

జైకిసాన్ స్ఫూర్తితో రైతును రాజును చేసిన ఘనత జగనన్న ప్రభుత్వానిది… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-మ‌హాత్ముని ఆశ‌యాల‌కు అనుగుణంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతిపిత మ‌హాత్మాగాంధీ ఆశ‌యాల‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  పాల‌న సాగుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంత్యోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. కస్తూరిభాయిపేటలో జరిగిన వేడుకలలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి  శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని మహాత్ముల విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారిలో మహాత్మాగాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి అగ్రగణ్యులన్నారు. మానవాళి ఉన్నంత వరకు వారి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆ మహాత్ములు బోధించిన సత్యం, అహింసా ఎంతో ఉన్నతమైనవని పేర్కొన్నారు. ఆ మహనీయుల ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకమని.. వారి ఆశయ సాధనకు వైఎస్సార్ సీపీ ఆదినుండి కృషి చేస్తోందన్నారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ.. నేడు ప్రతి కుటుంబంలో ఒక భాగంగా మారిందన్నారు. రాష్ట్ర చరిత్రలో గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలో చూపిన ఏకైక నాయకులు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అని మల్లాది విష్ణు తెలిపారు.

జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఒక్కటిగా నిలిపిన ధీరోదాత్తుడు లాల్‌ బహదూర్ శాస్త్రి అని మల్లాది విష్ణు  కీర్తించారు. ఆయన స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతు పక్షపాత ప్రభుత్వాన్ని నెలకొల్పారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయేనాటికి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఊహించలేమన్నారు. వ్యవ‌సాయం దండ‌గ అని చంద్రబాబు అంటే.. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  పండ‌గ చేసి చూపారన్నారు. ఆ మ‌హానేత కుమారుడు జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి అయ్యాక వ్యవ‌సాయానికి చేయూత‌నిచ్చి రైతును రాజును చేశారన్నారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అమ‌లు చేస్తున్న రైతు సంక్షేమ ప‌థ‌కాలు దేశానికే ఆద‌ర్శంగా నిలిచాయ‌న్నారు. జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టిన రెండేళ్లలోనే రాష్ట్రం ఊహించని ప్రగతి సాధించిందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమాలు జరుగుతాయన్నారు. ఆ మహాత్ముల స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యస్థాపనకు మనమంతా కృషి చేయాలని, వారి ఆశయాల సాధన కోసం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో బెల్లపు వెంకట్రావు, బెల్లపు సత్యనారాయణ, వెంకట్రామిరెడ్డి, కాజా శంకర్, బద్దేటి ఇస్సాక్, డి.శ్రీను, బొంగరాల భాస్కర్ రావు, శ్రీలక్ష్మి, గౌతమ్, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *