విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మారుతీనగర్ ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి.సి.లంతా ఏకమై శాంతియుతంగా బిసిల జనగణ కోసం ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ తరుపున శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రాష్ట్ర కమిటీలో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ, సిటి మహిళా అధ్యక్షురాలు దామర్ల సాంబ్రాజ్యం, బి.సి నాయకులు పెద్ద వెంకటేశ్వర్లు, కోటేశ్వరమ్మ, స్థానిక యువకులు గురుబ్రహ్మము, శివ, పవన్ తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …