-పవన్ కళ్యాణ్ పర్యటన అంటే వైసీపీ నాయకులకు భయం పట్టుకుంది…
-ముఖ్యమంత్రి వస్తే రోడ్లు వేసేవారు నేడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తే రోడ్లు వేస్తున్నారు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటన అంటే వైసీపీ నాయకులకు భయం పట్టుకుంది, వెన్నులో వణుకు మొదలైంది, చెమటలు పట్టడం మొదలైందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఈ రోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అన్నారు. గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేయాలని పవన్ కళ్యాణ్ ఒక పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా పనులు మొదలయ్యాయని గతంలో ముఖ్యమంత్రి వస్తే రోడ్లు వేసేవారు నేడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తే రోడ్లు వేస్తున్నారని, ప్రజలు చర్చించుకుంటున్నారని, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటున్న వైసీపీ పెద్దలు మరి ఎందుకు రోజుకు పది మంది మంత్రులు, ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు బయటికి వచ్చి ఎందుకు సమావేశాలు పెట్టి నోరు పారేసుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు, కోవిడ్ ఆంక్షలు పవన్ కళ్యాణ్ కే గాని సీఎం జగన్ కి వర్తించవఅని? ఈ రోజున ప్రచార ఆర్భాటం కోసం బెంజ్ సర్కిల్ వద్ద క్లీన్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ సంకల్ప్o కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఇదే కార్యక్రమాన్ని ఇంట్లో ఉండి కూడా స్విచ్ నొక్కి కార్యక్రమం చేయవచ్చని కానీ ప్రచార ఆర్భాటం కోసమే ఈ విధంగా ఏర్పాటు చేశారని, కోవిడ్ రాదని జగన్ కి ఏమైనా చెప్పిందా అని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఒంటరిగా పోటీ చేయలేదని, అనేక చీకటి ఒప్పందాలు చేసుకుందని, పక్క రాష్ట్రాల BC నేతలు, పచ్చనోట్లు, గులాబీ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారని ఈ విషయాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు మర్చిపోయినట్టు ఉన్నారని మీడియా ఉందికదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఉపేక్షించేది లేదన్నారు. రోడ్డు సెస్ ద్వారా వైయస్ జగన్ ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఇందులో కేవలం 200 కోట్ల రూపాయలకు కాంట్రాక్ట్లు ఇచ్చారని మిగిలిన 1300 కోట్ల రూపాయలు సీఎం జగన్ జేబులోకి వెళ్లాయయని, దీనిపై వైసిపి నాయకులు సమాధానం చెప్పాలని, ఈ రాష్ట్రంలో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు భయపడి పారి పోతున్నారని, గతంలో చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టర్లు ఏవిధంగా ముందుకు వస్తారో వైసిపి నాయకులు సమాధానం చెప్పాలన్నారు. రెండున్నరేళ్లుగా వైఎస్సార్సీపీ నాయకుల బూతుపురాణం విని ప్రజలు చీదరించు కుంటున్నారని, నేడు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నందుకు పదిమంది మంత్రులు బయటికి వచ్చి ఇష్టానుసారం బూతులు మాట్లాడుతున్నారని, వైఎస్సార్ సీపీ నాయకులను ఒక్కమాట అంటేనే వారికి నొప్పి కలిగింది అని, మరి రెండున్నర సంవత్సరాల నుంచి ఇష్టానుసారం మాట్లాడుతున్న వారి పదజాలాన్ని ఎందుకు ముఖ్యమంత్రి నియంత్రించలేక పోయారా సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకుల బూతు పంచాంగం ఎలా ఆపాలో పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసాని, ఇక నుంచైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే మిమ్మల్ని తప్పనిసరిగా క్రమశిక్షణలో పెట్టే బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకుంటారన్నారు. మహాత్మా గాంధీ జయంతి కి ఒక్కరోజు ముందు బ్రాందీ పాలసీ ప్రకటించి మద్యం అమ్మకాలు ప్రోత్సహించే లాగా జివో జారీ చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి కి గాంధీ జయంతి అర్హత లేదన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని గతంలో వారి ఇంటిని ముట్టడిస్తామని వస్తే పోలీసులు అడ్డంపెట్టుకుని పారిపోయారని ఇంకొకసారి పిచ్చి వాగుడు వాగితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.