-గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు…
-మంత్రి శ్రీను కి అవినీతి మీద ఉన్న దృష్టి అభివృద్ధిపై లేదు…
-నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద నుండి చిట్టినగర్ వరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని మంత్రి మరియు అధికారులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలో నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మొదటగా రాజా హై స్కూల్ మరియు హిమాలయ హోటల్ సెంటర్ వద్ద రోడ్డుకి ఇరువైపులా పడ్డ పెద్ద గోతులను మరియు నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద మలుపులో పడ్డ పెద్ద గోతిని మిక్స్ చేసి పోతిన మహేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రమదానం తో మరమ్మతులు చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన రహదారి అయినటువంటి నెహ్రూ బొమ్మ నుంచి చిట్టి నగర్ రోడ్డు కు భారీ ఫిదా పాట గోతులు ఎందుకు పోవడం లేదు అదే విధంగా నూతన రోడ్డు నిర్మాణం చేపట్టడానికి ఎందుకు ఆలస్యం అవుతుందో మంత్రి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు సమాధానం చెప్పాలని, మంత్రి ఇంటి ముందు వేసుకునే రోడ్డుకు కాంట్రాక్టర్లు దొరుకుతారుగాని నిత్యం వేలాదిమంది తిరిగే ప్రధాన రోడ్డు నిర్మించడానికి కాంట్రాక్టర్ల దొరకరా అని ఎద్దేవా చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి అవినీతిపై దృష్టిసారించారని , నియోజకవర్గంలో అన్ని ప్రధాన రహదారులు చిధ్రం అయిపోయాయని దీనిలో ప్రధానంగా సితార జంక్షన్, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్, కరెంట్ ఆఫీస్ రోడ్డు, హిందూ హైస్కూల్ ఎదురు రోడ్డు, పాటుగా కొండ ప్రాంతంలో రహదారులు పూర్తిగా పాడైపోయాయి అని, కనీసం మరమ్మతులు కూడా నోచుకోవడం లేదని, అధికారులైన స్పందించి కనీస మరమ్మతులు చేపట్టాలని మహేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి లింగం .శివప్రసాద్, సయ్యద్. మోబిన ,కార్యదర్శిలు కొరగంజి. రమణ,సనివరపు .శివ, విజయకుమరి, సహాయ కార్యదర్శులు మురళి కృష్ణ, నరేష్, కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థులు భక్తుల.వెంకటేష్, ఆలమూరి సాంబశివరావు, తిరుపతి అనూష, బొమ్ము రాంబాబు,న్యాయ విభాగం కృష్ణా జిల్లా కార్యదర్శి గంజి. పవన్ అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు తమ్మిన. రఘు ,నాళంశెట్టి .కుర్మా రావ్ , అడ్డగిరి.పుల్లారావు,రేవడి. రమాదేవి ,పవన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.