Breaking News

రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చటటమే లక్ష్యం

-నెడ్ క్యాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీ. కమలాకర్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ రంగంలో దేశానికి మార్గదర్శకంగా నిలిపే లక్ష్యంతో పని చేస్తున్నామని నెడ్ క్యాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీ. కమలాకర్ బాబు తెలిపారు. స్థానిక లెమన్ ట్రీ హోటల్ లో వివిధ రంగాల్లో గ్రీన్ ఎనర్జీ కోసం కృషి చేసిన 22 మందికి ప్రకాష్‌మయ్ (PRAKASH may Enertia Awards 2026) ఎనర్షియా అవార్డ్స్ 2026 ను అందించే కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా నెడ్ క్యాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీ. కమలాకర్ బాబు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలు, పునరుత్పాదక ఇంధన నోడల్ ఏజెన్సీలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల కృషిని గుర్తించి ఈ అవార్డులను అందించామన్నారు ..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అక్టోబర్ 2024 లో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో 160 గిగావాట్ల (GW) క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సాధించడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించామన్నారు. భారత ప్రభుత్వం 2030 నాటికి నిర్దేశించిన 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యానికి అనుగుణంగా, అలాగే స్వర్ణాంధ్ర ప్రదేశ్ – 2047 విజన్ ను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ పాలసీ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.

పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ఈ పాలసీ కింద గాలి విద్యుత్ (విండ్), సౌర విద్యుత్ (సోలార్), హైబ్రిడ్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) వంటి ఆధునిక పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

ఇప్పటివరకు 83 గిగావాట్ల సామర్థ్యానికి అనుమతులు మంజూరు చేయగా, ఈ రంగంలో సుమారు రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. అదేవిధంగా 51 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.

భారతదేశం నిర్దేశించిన విధంగా, 2047 నాటికి ‘నెట్ జీరో’ కార్బన్ ఉద్గారాల స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించిందన్నారు. క్లీన్ ఎనర్జీ విస్తరణ ద్వారా కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు.

జాతీయ స్థాయిలో రాష్ట్రానికి 4 ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయన్నారు. ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమంలో పునరుత్పాదక ఇంధన రంగంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయన్నారు.

ప్రభుత్వ సంకల్పం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, చీఫ్ సెక్రటరీ కే. విజయానంద్ పర్యవేక్షణలో రాష్ట్ర ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్ర ప్రజలకు నమ్మకమైన, చౌకైన, నాణ్యమైన విద్యుత్తు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని కమలాకర్ బాబు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *