Breaking News

విజయవాడలోని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం

-కూటమి ప్రభుత్వంలో శరవేగంగా అభివృద్థి పనులు
-ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్ల‌డి
-తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్థి పనులకు శంకుస్థాపన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రేటర్‌ విజయవాడగా రూపాంతరం చెందనున్న విజయవాడ నగరంలోని రోడ్లు, డ్రైయిన్లు, డ్రైనేజీ సమస్యలకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని పార్లమెంట్‌ సభ్యులు, కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.

తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో వివిధ అభివృద్థి పనులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కలిసి శుక్రవారం ఉదయం శంకుస్థాపనలు చేశారు. 8వ డివజన్‌లో ఒక కోటి ఎనభై లక్షల వ్యయంతో మురుగునీటి కాలువలు, రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటుగా ఆచార్య ఎన్‌జి.రంగా పార్క్‌ లో యోగా మెడిటేషన్‌ సెంటర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్‌ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థతో కలిసి విజయవాడ నగర అభివృద్థికి రూ.2,800 కోట్ల అంచనాలతో డీపీఆర్‌లు సిద్దం చేస్తున్నామన్నారు. విజయవాడ నగరంలో రోడ్లు, డ్రైనేజీ, స్ట్రామ్‌ వాటర్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాబోయే కాలంలో విజయవాడ నగరాన్ని గ్రేటర్‌ విజయవాడ చేయటానికి సన్నాహాలు చేపట్టామన్నారు. గ్రేటర్‌ విజయవాడగా రూపాంతరం చెందేలోపుగా నగరంలోని అన్ని సమస్యలను ఎమ్మెల్యేల సహకారంతో పరిష్కరిస్తామని ఎంపీ చెప్పారు. కూటమి ప్రభుత్వంలో విజయవాడ నగరం శరవేగంగా అభివృద్థి వైపు పయనిస్తుందని అన్నారు.

తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తూర్పు నియోజకవర్గంలో అభివృద్థి మొదలైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పు నియోజకవర్గం లోని సమస్యలను పరిష్కారానికి అభివృద్థి పనులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులను మంజూరు చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో రహదారులతో పాటుగా డ్రైయిన్లు, భూగర్భ డ్రైనేజీ సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని టవర్‌ లైన్‌రోడ్డు, మహానాడు రోడ్డు, బల్లెంవారివీధితో పాటు అనేక ప్రధాన, అంతర్గత రహదారులను విస్తరిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు.

కార్పొరేటర్‌ ఉషారాణి మాట్లాడుతూ డివిజన్‌లో డ్రైయిన్ల నిర్మాణాలు, రోడ్లు నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్థి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నగరాన్ని అభివృద్థి చేయడానికి ఎంపీ. కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కృషి చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు ముమ్మనేని ప్రసాద్, జాస్తి సాంబశివరావు, నాయకులు కొత్తపల్లి రమేష్, దూళిపాళ్ళ రమేష్, రామారావు, మల్లెల రామకృష్ణ, రమణి, కృపారావు, భవానీ, రామచంద్రరావు, అట్లూరి శ్రీనివాస్, సాంబశివరావు, మంగళపాటి శ్రీనివాసరావు, వి.ఎం.సి. ఇ.ఇ. సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *