Breaking News

గుణ‌ద‌ల‌లో రెండు ఆర్.వో.బిలకు త్వ‌ర‌లో శంకుస్థాప‌న : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-క్రెడాయ్ ఎక్స్ పో ను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని
-ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ బొండా ఉమాహ‌హేశ్వ‌రరావు, గ‌ద్దె రామ్మోహ‌న్, బోడే ప్ర‌సాద్ హాజ‌రు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రియ‌ల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే రాష్ట్రాభివృద్ది శ‌ర‌వేగంగా జ‌రుగుతుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. బంద‌ర్ రోడ్డులోని ఎ క‌న్వేన్ష‌న్ సెంట‌ర్ లో ఏర్పాటు చేసిన 11వ క్రెడాయ్ ప్రాప‌ర్టీ షోను శుక్ర‌వారం ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ బొండా ఉమాహ‌హేశ్వ‌రరావు, గ‌ద్దె రామ్మోహ‌న్, బోడే ప్ర‌సాద్ ల‌తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్రారంభించారు. స‌భ అనంత‌రం ప్ర‌జాప్ర‌తినిధుల‌ను క్రేడాయ్ స‌భ్యులు ఘ‌నంగా స‌న్మానించారు.

ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి రావాల్సి వుందని, అయితే బిజీ షెడ్యూల్ వ‌ల్ల రాలేక‌పోయార‌ని తెలిపారు. క్రేడాయ్ నిర్వ‌హించే ఇత‌ర కార్య‌క్రమాల‌కు త‌ప్ప‌కుండా వ‌స్తాన‌న్న సీఎం చంద్ర‌బాబు సందేశం తెలియ‌జేశారు. అమ‌రావ‌తి అభివృద్ది తో పాటు రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్దికి క‌ష్ట‌ప‌డుతున్న సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌లంద‌రి త‌రుఫున ధ‌న్య‌వాదాలు తెలిపారు.

గ‌తంలో రియ‌ల్ ఎస్టేట్ అంటే చిన్న చూపు వుండేద‌ని, ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితులు లేవ‌న్నారు. కానీ 2019 నుంచి 2023 వ‌ర‌కు బిజినెస్ స‌రిగా చేయ‌లేకపోయామ‌ని….తిరిగి చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి గా అయిన త‌ర్వాత రియ‌ల్ ఎస్టేట్ రంగానికి కాస్త వెసులు బాటు దొరికింద‌న్నారు.

హైద‌రాబాద్ దేశంలోనే అగ్ర‌గామి న‌గ‌రం అబివృద్ది చెంద‌టానికి ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు తీసుకున్న నిర్ణ‌యాలు కార‌ణమ‌న్నారు. హైద‌రాబాద్ అభివృద్దిలో రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌ముఖ పాత్ర పోషించిందని పేర్కొన్నారు. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ను అభివృద్ది దిశ‌గా న‌డిపించేందుకు సీఎం చంద్ర‌బాబు ఆనాడు మొద‌ట గుర్తించిన రంగం రియ‌ల్ ఎస్టేట్ రంగ‌మ‌న్నారు. రియ‌ల్ ఎస్టేట్ రంగం బాగుండాలంటే మౌలిక స‌దుపాయాలు అవ‌సరం…ఉద్యోగవ‌కాశాలు వుండే ఇండ‌స్ట్రీలు రావాలి.

ఇందుకోసం మంత్రి నారాయ‌ణ మిగ‌తా రాష్ట్రాల్లో వున్న బెస్ట్ పాల‌సీను రాష్ట్రంలో అమ‌లు చేయ‌టంతో పాటు , చాలా రూల్స్ కి వెసులుబాటు క‌ల్పించార‌ని గుర్తు చేశారు. ఈ రంగం బాగుంటేనే అమ‌రావ‌తి, విశాఖప‌ట్ట‌ణం, అనంత‌పురం ముందుకు వెళ‌తాయన్నారు. రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ ప‌ర్స‌న్స్ కు ఏమైనా స‌మ‌స్య‌లు వుంటే జిల్లాలోని ఎమ్మెల్యేల‌తో క‌లిసి సీఎం దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్క‌రించేందుకు కృషిచేస్తామ‌న్నారు.

న‌గ‌రంలో మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తే రియ‌ల్ ఎస్టేట్ రంగానికి ఊతం వ‌స్తుంద‌న్నారు. రాబోయే నేష‌న‌ల్ హైవే ఇబ్ర‌హీం ప‌ట్నం, గోల్ల‌పూడి ప్రాంతాల మీద నుంచి క‌న‌క‌దుర్గ‌మ్మ వార‌ధి వ‌ర‌కు రెండు ఫ్లై ఓవ‌ర్లు రాబోతున్నాయ‌న్నారు. అలాగే గంగూరు పెన‌మ‌లూరు నుంచి నేష‌న‌ల్ హైవే ఇవ్వాల‌ని నేష‌న‌ల్ హైవే అధికారులను ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మోహ‌న్, బోడే ప్ర‌సాద్ ల‌తో క‌లిసి కోర‌టం జ‌రిగింద‌న్నారు.

అలాగే గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేస‌ర‌ప‌ల్లి మీదుగా రామ‌వ‌ర్ప‌పాడు ఆంధ్ర‌జ్యోతి మీదుగా ఒక స‌ర్వసు రోడ్డు ఇవ్వాల‌ని కూడా కోర‌టం జ‌రిగింద‌న్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి అమ‌రావ‌తి వెళ్లేందుకు నిడ‌మానురు, ఎనికేపాడు కాకుండా విజ‌య‌వాడ వ‌చ్చేందుకు మ‌రొక రోడ్డు ఇవ్వాల‌ని అధికారుల‌ను అడ‌గ‌టం జ‌రిగింద‌న్నారు.

సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గం లోని గుణ‌ద‌ల వాసుల 20 ఏళ్ల క‌ల రెండు ఆర్.వో.బిలు…ఆ రెండు ఆర్.వో.బిల‌కు మ‌రో ప‌దిహేను రోజుల్లో శంకుస్థాప‌న చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. అలాగే ఎల్.సి నెంబ‌ర్ 8 కి సంబంధించి నెల రోజుల్లో టెండ‌ర్ల‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు. రెండు ఆర్.వో.బిలు నిర్మాణం పూర్తి అయితే గుణ‌ద‌లకు మంచి క‌నెక్టివిటీ వ‌స్తుంద‌న్నారు. అదే విధంగా సింగ్ న‌గ‌ర్ నుంచి మ‌ధుర న‌గ‌ర్ వ‌ర‌కు కూడా ఆర్.యు.బి మంజూరు అయిన‌ట్లు చెప్పారు. వాంబే కాల‌నీ వాసులు న‌గ‌రంలోకి రావ‌టానికి సింగ్ న‌గ‌ర్ ప్లై ఓవ‌ర్ మీద నుంచి రావాల్సి వ‌స్తుంద‌ని..ఈ ఆర్.యు.బి వ‌ల్ల ట్రాపిక్ ఇబ్బందులు తొలగిపోతాయ‌న్నారు. గుణ‌ద‌ల రైల్వే స్టేష‌న్ కూడా మ‌రో 6 నెల‌ల స‌మ‌యంలో ప్రారంభం కానుంద‌న్నారు. గొల్ల‌పూడి నుంచి రాయ‌న‌పాడు రైల్వే స్టేష‌న్ దాకా ఆర్.అండ్ బి అండ్ రైల్వే స్ క‌లిసి వంద అడుగుల రోడ్డు వేయ‌బోతున్నాట్లు తెలిపారు.

వీటివ‌ల్ల గొల్లపూడి పెనమలూరు గుణదల ప్రాంతాలు రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు చెప్పిన విధంగా మరి ఎక్కువగా ధరలు పెంచకుండా మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉండాలని సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో క్రెడాయ్ చైర్మ‌న్ సి.స‌తీష్ బాబు, ప్రెసిడెంట్ జి.ఎస్.ఆర్.మోహ‌న్ రావు, సెక్ర‌ట‌రీ ర‌ఘురామ్, ఎపీ క్రెడాయ్ సెక్ర‌ట‌రీ దాస‌రి రాంబాబు , ఎస్.బి.ఐ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శైలేష్ కుమార్ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *