Breaking News

ప్రజలను పీడించే పాలనను (పిపిపి) అంతమొందించాలి… : రిపబ్లికన్ పార్టీ ఇండియా (బి.ఎ)

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ మెడికల్‌ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేక నిరాహార దీక్షల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (బిఎ), కాంగ్రెస్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర అధ్యక్షులు జి విజయ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్, సిపిఐ, సిపిఎం, (వైఎస్ఆర్‌సీపీ)తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రజాసంఘాలు, సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (బి.ఎ) రాష్ట్ర అధ్యక్షులు ఐఆర్ఎస్ రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, ధర్నా ను ఉద్దేశిస్తూ ప్రసంగించారు.

ప్రస్తుత టిడిపి ప్రభుత్వం – పిపిపి విధానం: రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వైద్య విద్య, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రైవేటీకరించే దిశగా వేగంగా అడుగులు వేస్తోందన్నారు. ఇది కేవలం కొన్ని మెడికల్‌ కాలేజీల వరకు పరిమితం కాదన్నారు. రాబోయే కాలంలో మొత్తం ప్రభుత్వ వైద్య రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే విధానమే ఈ పిపిపి మోడల్‌. టిడిపి అధికారంలోకి రాకముందు – ప్రజలకు ఇచ్చిన హామీలు: ఎన్నికల ముందు టిడిపి, జనసేన బిజెపి నేతలు స్పష్టంగా ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మెడికల్‌ సీట్లను పూర్తిగా రద్దు చేస్తాం. అన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. పేద విద్యార్థులకు తక్కువ ఫీజులతో వైద్య విద్య, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి ఉచిత వైద్యం. ఈ హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. టిడిపి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు (అప్డేట్): 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను పిపిపి పద్ధతిలో అప్పగింపు. ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం, మొదటి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని, ఈ మెడికల్‌ కాలేజీలను పిపిపి పద్ధతిలో ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచిందన్నారు.

రెండో దశలో: పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం. వీటినీ త్వరలోనే ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల ప్రైవేటీకరణ: టిడిపి ప్రభుత్వం తీసుకున్న అత్యంత ప్రమాదకర నిర్ణయం. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా పిపిపి కింద ప్రైవేట్‌ సంస్థలకి అప్పగించడం. ఐదేళ్లపాటు లేదా 80% బెడ్లు నిండేవరకు ప్రైవేట్‌ సంస్థలే ఆసుపత్రి నిర్వహణ. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల సమాధి శాసనం. పిపిపి ఒప్పంద నిబంధనల్లోని ప్రజావ్యతిరేక అంశాలు: టిడిపి ప్రభుత్వం రూపొందించిన పిపిపి ఒప్పందంలో: 66 సంవత్సరాలపాటు ప్రభుత్వ భూములు ప్రైవేట్‌ చేతుల్లో ఎకరానికి ఏడాదికి కేవలం రూ.100 లీజు. 30% బెడ్లను పూర్తిగా కమర్షియల్‌గా వినియోగించుకునే హక్కు. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఉచిత వైద్యం లేదు. ఎమర్జెన్సీ చికిత్సకు కూడా ముందుగా అనుమతులు. డయాగ్నస్టిక్‌, రక్త పరీక్షలు, స్కాన్లకు చార్జీలు. కార్పొరేట్‌ ఫీజులు చెల్లించలేని పేదలకు వైద్యం నిరాకరణ. ఇది పబ్లిక్‌ హెల్త్‌ కాదు – కార్పొరేట్‌ హెల్త్‌: వైద్య విద్యపై టిడిపి ప్రభుత్వ దాడి. కన్వీనర్‌ కోటా సీట్లు క్రమంగా తగ్గింపు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల పెంపు. సంవత్సరానికి రూ.12–20 లక్షల ఫీజులు. పేద, దళిత, బహుజన విద్యార్థులకు వైద్య విద్య దూరం. టిడిపి ప్రభుత్వం మెడికల్‌ విద్యను “ధనవంతుల ప్రత్యేక హక్కు”గా మార్చుతోందన్నారు. కేంద్ర బీజేపీ విధానాలకు టిడిపి తలొగ్గడం: కేంద్ర బీజేపీ ప్రవేశపెట్టిన వైబులిటీ గ్యాప్‌ ఫండ్‌ పథకం అమలు. వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్‌ సంస్థలకు బదిలీ. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2000 కోట్ల కేటాయింపు. రాష్ట్ర హక్కులు కాదు – కార్పొరేట్‌ లాభాలే టిడిపి లక్ష్యం: ఇది కేవలం 10 మెడికల్‌ కాలేజీలతో ఆగదన్నారు.

ప్రస్తుత సంకేతాలు స్పష్టం:
మిగిలిన 7 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్వహణ అప్పగింపు. జిల్లా, ఏరియా ఆసుపత్రులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. మొత్తం ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ప్రైవేట్‌ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం అన్నారు. ప్రజల ముందున్న కర్తవ్యం. ఈ పరిస్థితుల్లో: పిపిపి విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు – ప్రభుత్వమే నిర్వహించాలి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను కాపాడాలన్నారు. ఉచిత వైద్యం, సమాన వైద్య హక్కులు అందరికీ కల్పించాలన్నారు. ఈ పోరాటం లేకపోతే రేపు ప్రభుత్వ ఆసుపత్రి అనే మాటే మిగలదన్నారు.

ఈ ధర్నా కార్యక్రమంలో ఆర్పిఐ బిఏ పార్టీ నాయకులు గుర్రం రామారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు, పిల్లి రాజు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, బండమూరు స్టాలిన్ బాబు రాష్ట్ర కమిటీ నాయకులు, చేబ్రోలు ప్రసాదరావు రిటైర్డ్ డిఎంహెచ్వో రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాయపూడి చార్లెస్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు, బర్రె సోహన్లాల్ రాష్ట్ర కార్యదర్శి, కొమ్మలపాటి లక్ష్మీనారాయణ ఆర్పిఐ నాయకులు, బీరం రెడ్డి మస్తాన్ రెడ్డి స్టేట్ కమిటీ నాయకులు, తలారి వెంకటకృష్ణ సాంస్కృతిక రాష్ట్ర విభాగ నాయకులు, బొల్లెద్దు ప్రసాదు రాష్ట్ర కమిటీ నాయకులు, సిరివెళ్ల చిట్టిబాబు గారు కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి, కోడి రెక్క ఎలీషా గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి. చుక్క దేవరాజు గుంటూరు కమిటీ నగర నాయకులు, ధారా దుర్గ ప్రసాద్ మంగళగిరి నియోజకవర్గ నాయకులు, పాపా బత్తుల ప్రభుదాసు గారు ఆర్పిఐ నాయకులు, మాలప్రోలు రాజారావు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *