ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా శరన్నవరాత్రి 7వ రోజైన బుధవారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారములో దర్శన మిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సాయంత్రం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డా॥ జి. వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్వాగతం పలికి, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో అంతరాలయంలోకి తోడ్కొని వెళ్లారు. అంతరాలయంలో ప్రధానార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతిని అందచేశారు. ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా ఆలయ ఇవో అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డా|| జి.వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వాహణాధికారిణి డి. భ్రమరాంబ, ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, జాయింటు కలెక్టర్లు డాక్టర్ కె.మాధవీలత, ఎల్ శివశంకర్, సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్ తదితరులు ఉన్నారు.
Tags indrakiladri
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …