విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా సంక్షోభ సమయం నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు ఆహార నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ వారు అండగా నిలవడం గొప్ప విషయమని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయంలో నగర బీసీ నాయకులు కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశుధ్య కార్మికులు, సచివాలయ సిబ్బందికి ఉచిత నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని సరకులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయి నిరుపేదలు ఎన్నో అవస్థలు పడ్డరని అలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్షయపాత్ర వారు ముందుకు వచ్చి అలాంటి వారందరికి నిత్యావసర వస్తువులు, ఆహారం అందజేయడం అభినందనీయం అని,తూర్పు నియోజకవర్గంలో కూడ ఇప్పటికే వేలమందికి నిత్యావసర వస్తువులు అందజేశారని నేడు కూడా దాదాపు 200 మందికి నాణ్యమైన అన్నిరకాల వస్తువులు అందజేసినందుకు నిర్వాహకులను అభినందించారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …