విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో సామాజిక సేవ కార్యక్రమల ద్వారా అందరికి సూపరిచితులైన యలమంచిలి జయ నిరుపేదలకు అండగా నిలవడం అభినందనీయం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గం 5, 8 డివిజన్ లో నిరుపేద కుటుంబాలకు చెందిన పచ్చిగోళ్ళ రమేష్ మరియు ఆర్లగడ్డ అనిల్ లకు జీవనోపాధి నిమిత్తం బడ్డీకొట్టు,టిఫిన్ బండి లను వైయన్ఆర్ చారిటీస్ ద్వారా అవినాష్ అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవ కార్యక్రమలలో నన్ను కూడా భాగస్వామ్యని చేస్తునందుకు సంతోషంగా ఉందని భవిష్యత్తు లో కూడా సేవ కార్యక్రమలు ఇలానే కొనసాగించాలని తన పూర్తి సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కో ఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు, కార్పొరేటర్లు కలపాల అంబేద్కర్, భీమిశెట్టి ప్రవల్లిక, కొత్తపల్లి రజనీ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …