విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వాటి ద్వారా రాష్ట్రంలో ప్రతి మహిళా లక్షాధికారి కావాలని అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం క్రీస్తురాజపురం RCM స్కూల్ గ్రౌండ్ లో జరిగిన 3,5 డివిజిన్ల వైయస్సార్ ఆసరా రెండవ విడత నిధులు మంజూరు చేసిన సందర్భంగా లబ్ధిదారులతో నిర్వహించిన ఆసరా సంబరాలు కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా డివిజిన్ల పరిధిలో 318 గ్రూపులకు మంజూరు అయిన దాదాపు 2కోట్ల 52 లక్షల రూపాయల నమూనా చెక్కును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ప్రతి పధకంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని,మహిళల మదిలో జగన్ చిరస్థాయిగా నిలిచిపోత్రాని వారి ఆశీస్సులతో రాబోయే 30సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారని ధీమా వ్యక్తంచేశారు. అమ్మఒడి,ఆసరా,చేయూత ద్వారా నేరుగా మహిళల ఖాతాలలో నగదు జమ చేస్తున్నారు అని,ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నారు అని మహిళలలో రోజు రోజుకు ప్రభుత్వం మీద పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలు వ్యవస్థ లను అడ్డుపెట్టుకుని కుట్రలు చేయడం బాధాకరమని అన్నారు.ఎవరెన్ని కుట్రలు చేసిన ప్రతి మహిళా సొంతింటి కలను జగన్ నెరవేరిస్తారని,ప్రతిపక్ష పార్టీలు ఇక అధికారంలోకి రావడం కల్లనే అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ, కో ఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు, 3,5 డివిజన్ కార్పొరేటర్లు కలాపాల అంబేద్కర్, భీమిశెట్టి ప్రవళిక, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కనకారావు, గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లామ్ కిరణ్, 2 వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలాకుమారి మరియు రెండు డివిజన్ల నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …