Breaking News

అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ నియామకాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం

-ఆన్‌లైన్ నమోదు: 13-02-2026 నుండి 01-04-2026 వరకు
-ఆన్‌లైన్ CEE పరీక్షలు: 01-06-2026 నుండి 15-06-2026 వరకు నిర్వహణ కు తాత్కాలిక ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
Indian Army ఆధ్వర్యంలోని Army Recruiting Office, Visakhapatnam ద్వారా అగ్నిపథ్ పథకం కింద రిక్రూటింగ్ ఇయర్–2027 కు సంబంధించిన అగ్నివీర్ నియామకాల కోసం వివాహం కాని పురుష అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలియజేయడమైనది. ఈ నియామక ప్రక్రియలో తూర్పు గోదావరి జిల్లా కు చెందిన అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలియ చేశారు. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం క్రింది విభాగాల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
అగ్నివీర్ (జనరల్ డ్యూటీ),
అగ్నివీర్ (టెక్నికల్),
అగ్నివీర్ (క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్),
అగ్నివీర్ (ట్రేడ్స్‌మన్ – 10వ తరగతి ఉత్తీర్ణులు),
అగ్నివీర్ (ట్రేడ్స్‌మన్ – 8వ తరగతి ఉత్తీర్ణులు),

ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ 13-02-2026 నుండి 01-04-2026 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు తప్పనిసరిగా Join Indian Army అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయావలసి ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE) కు అర్హులు అని తెలియ చేశారు.

నియామక ప్రక్రియ లో భాగంగా:
దశ – I: ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (Online CEE) 01 జూన్ 2026 నుండి 15 జూన్ 2026 వరకు (తాత్కాలికంగా రూపొందించిన షెడ్యూల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో నిర్వహించబడు తుందన్నారు. దశ – II లో దశ–Iలో అర్హత సాధించిన (Shortlisted) అభ్యర్థులు నిర్ణీత తేదీ మరియు సమయానికి సంబంధిత Recruitment Rally వివరాలు అనుసరించి నిర్దేశిత ప్రాంగణానికి హాజరు కావలసి ఉంటుందన్నారు. ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రత్యేకంగా విడుదలయ్యే ర్యాలీ నోటిఫికేషన్‌లో తెలియజేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అర్హత కలిగిన యువతకు విస్తృతంగా సమాచారం చేరేలా ముద్రిత మరియు ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించి పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా సంబంధిత అధికారులను కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. డైరెక్టర్ రిక్రూటింగ్ కర్నల్ ఆర్.కే. సింగ్ వివరాలు తెలియ చేస్తూ, మూడోవ దశలో ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE)లో అర్హత సాధించి షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు, సూచించిన తేదీ మరియు సమయానికి నిర్దేశిత నియామక ర్యాలీ వేదిక వద్ద హాజరు కావలసి ఉంటుందన్నారు. ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు ర్యాలీ తదుపరి నోటిఫికేషన్‌లో తెలియ చేయడం జరుగుతుందని తెలియ చేశారు. అర్హత గల అభ్యర్థులకు ఈ సమాచారం విస్తృతంగా చేరేలా తగిన ప్రచారం నిర్వహించవలసిందిగా డైరెక్టర్ రిక్రూటింగ్ కర్నల్ ఆర్.కే. సింగ్ తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *