Breaking News

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మార్చి 7, 8 తేదీల్లో జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా పర్యటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఛైర్మన్  కిషోర్ మక్వానా (Kishor Makwana) మార్చి 6 వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు రానున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ షెడ్యూల్ ప్రకారం, మక్వానా 06-03-2026 శుక్రవారం సాయంత్రం 18:30 గంటలకు ఇండిగో విమానం (6E 7546) ద్వారా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని, ఓఎన్‌జీసీ అతిథి గృహంలో రాత్రి బస చేస్తారు. మార్చి 7 వ శనివారం ఉదయం 11:00 గంటలకు తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక అభివృద్ధి మరియు రక్షణాత్మక చర్యలపై కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్ మరియు ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ధవళేశ్వరం వర్క్‌షాప్‌లో, ఓఎన్‌జీసీ ప్రాంగణంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మరియు ఓ ఎన్ జి సి అధికారుల సమావేశంలో పాల్గొంటారు. తదుపరి వివిధ అధికారిక సమావేశాలు నిర్వహించి, దిండి (రాజోలు) ప్రాంతంలోని సామాజిక సంక్షేమ వసతి గృహాలను సందర్శించి అక్కడే రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. 08-03-2026 ఆదివారం ఉదయం 11:00 గంటలకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఎక్కడ నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుని , విమానాశ్రయం నుండి ఎయిర్ ఇండియా విమానం ద్వారా న్యూ ఢిల్లీకి ప్రయాణిస్తారు. జిల్లా స్థాయి అధికారులతో మార్చి 7 వ శనివారం ఉదయం జరిగే సమీక్షా సమావేశం స్థానిక కలెక్టరేట్ పి.జి.ఆర్‌.ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించ బడుతుందని, అధికారులు ఉదయం 10.30 గంటలకి సంబంధిత నివేదికలతో సమావేశం కు హజరు కావాలని ,జిల్లాలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అమలులో ఉన్న పథకాలు, సమస్యల పరిష్కారం మరియు రక్షణాత్మక చర్యల అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎస్.కె. జియాజుద్దీన్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *