అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ధాన్యం సేకరణ (Paddy Procurement)ను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.ఈమేరకు సోమవారం అమరావతి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలను కేంద్రంగా చేసుకుని ధాన్యం సేకరణ వేగవంతంగా చేయాలని ఆదేశించారు.అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించాలని చెప్పారు. అంతేగాక రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ మరింత సులువుగా సాఫీగా జరిగేలా చూడాలని సిఎస్ ఆదేశించారు.
జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షపై సమీక్ష:
అనంతరం జిల్లా కలెక్టర్లతో సిఎస్ డా.సమీర్ శర్మ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకం జిల్లా కలెక్టర్లు తో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.ఈకార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపధ్యంలో ఈకార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ డా.సమీర్ శర్మ కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.