విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వార్డ్ సచివాలయల ప్రత్యేక అధికారిణిగా బాద్యతలు స్వీకరించిన నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ (జనరల్) డా.జె.అరుణ బుధవారం కౌన్సిల్ హాల్ నందు 286 వార్డ్ సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది యొక్క విధులను అడిగి తెలుసుకొని ప్రతి ఒక్కరు సేవా దృక్పదంతో ప్రజలకు మెరుగైన సేవలను అందించేలా, భాద్యతగా తమకు కేటాయించిన విధులు సక్రమముగా నిర్వహించాలని అన్నారు. ప్రతి సచివాలయం నందు విధిగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకముల యొక్క వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. అదే విధంగా ప్రజల అందించు సమస్యల అర్జిలను వెనువెంటనే సంబందిత అధికారులకు పంపి వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఏమైన ఇబ్బందులు కలిగిన యెడల తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఆస్తి పన్నుకు ఆధార్ జతపరచు పనుల యొక్క పురోగతిని అడిగితెలుసుకొని వేగవంతముగా పూర్తి చేయునట్లుగా చూడాలని ఆదేశించారు. సమావేశంలో NVS ప్రసాద్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు మరియు PMU సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …