విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులను వినియోగించుకుని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హౌసింగ్ కింద నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పురోగతి, జగనన్న శాశ్వత గృహహక్కు పథకం, ఎస్ఆర్ఈజీఎస్ పనులు, లేబర్ బడ్జెట్, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ (రూరల్), బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీస్, వైఎస్ఆర్ ( అర్బన్ హెల్త్) క్లినిక్లు, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు, ఖరీఫ్ పంట, రబీ సీజన్ సంసిద్ధత, వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పథకం తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జె. నివాస్ పాల్గొన్నారు. అదే విధంగా వియంసి కమిషనర్ వి. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్లు డా.కె, మాధవిలత, కె. మోహనకుమార్, శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టి. మోహన్‌రావు, హౌసింగ్ పిడి రామచంద్రన్, పంచాయతీరాజ్ ఎఇ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ఎజిఎస్లో మెటిరియల్ కాంపోనెంట్ కింద నిధులు అందుబాటులో ఉన్నాయని వాటిని ఉపయోగించుకుని అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇ-క్రాప్ నమోదు, సియం యాప్ పై దృష్టి పెట్టాలన్నారు. వివిధ పంటల మద్దతుల ధర తెలిపే పోస్టర్లను రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవగాహన పరిచే విధంగా ప్రదర్శించాలన్నారు. డిజిటల్ లైబ్రరీలకు అవసరమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ జిల్లాలో 809 గ్రామ సచివాలయ భవనాలకుగాను నిర్మాణ పనులను డిసెంబరు 31 నాటికి పూర్తి చేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు తదితర నిర్మాణ పనులను నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేస్తామన్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు నిర్మాణాలపై దృష్టి సారించామన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …