విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రక్షణ, అంతర్గత పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజా శాంతి భద్రతలను పరిరక్షణ కోసం అరాచక శక్తుల అణచివేసి విధి నిర్వహణలో అశువులు బాసిన అమర పోలీసు వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి త్యాగనిరతికి చిహ్నంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ గురువారం విజయవాడ నగరంలోని బందర్ రోడ్ లో గల ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమర వీరుల సంసర్మణ దినం సందర్భంగా స్మృతి పెరేడ్ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మో హనరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి గౌరవ వందనం స్వీకరించి అమరులైన పోలీస్ జవాన్లకు ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం ఆర్ముడు రిజర్వుడ్ గ్రౌండ్స్ నందు గల వ్యాస్ కాంప్లెక్స్ వద్ద ఆధునిక హంగులతో పునర్ నిర్మించిన దివంగత కె.ఎస్.వ్యాస్, ఐ.పి.ఎస్., విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి. డి.గౌతమ్ సవాంగ్ ఐ.పి.ఎస్., ప్రారంభించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా… పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, వ్యాస్ చేసిన సేవలు చిరస్మరణీయమని, వ్యాస్ పోలీస్ వ్యవస్థకు చేసిన సేవలు మన అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎస్.ఆర్.టి.సి., ఎమ్.డి. ద్వారకా తిరుమలరావు, ఐ.పి.ఎస్., లా&ఆర్డర్ అదనపు డి.జి.పి. రవిశంకర్ అయ్యనార్, ఐ.పి.ఎస్., అదనపు డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా, ఐ.పి.ఎస్., అదనపు డి.జి.పి. రాజేంద్రనాద్ రెడ్డి, ఐ.పి.ఎస్., అమిత్ గార్డ్, ఐ.పి.ఎస్, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాసులు, ఐ.పి.ఎస్., ఐ.జి.పి. నాగేంద్ర కుమార్, ఐ.పి.ఎస్., టెక్నికల్ డి.ఐ.జి. పాలరాజు , ఐ.పి.ఎస్., ఈస్ట్ డి.సి.పి. హర్షవర్థన్ రాజు, అడ్మిన్ డి.సి.పి. మేరీ ప్రశాంతి, సి.ఎస్. డబ్ల్యు, , డి.సి.పి. ఉదయరాణి మరియు పలువురు ఐ.పి.ఎస్., అధికారులు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పూలమాలు వేసి ఘన నివాళి అర్పించారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …