కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల మేరకు కొవ్వూరు 23వార్డు కి సంబంధించిన రెండు పోలింగ్ కేంద్రాల తుది నోటిఫికేషన్ విడుదల చేశామని కొవ్వూరు మునిసిపల్ కమీషనర్. కె.టి.సుధాకర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కమిషనర్ వారి కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల తుది జాబితా ను ప్రకటించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలో 23 వ వార్డు పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం మండల పరిషత్తు ఎలిమెంటరీ స్కూల్ (ముస్లిం స్కూల్) మెరకవీధి, కొవ్వూరు ప్రాంగణంలో రెండు తరగతి గదులను గుర్తించి తుది నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో 21.8.2021 న ఓటర్ల తుది జాబితాను ప్రచురించామన్నారు. 23వ వార్డు పరిధిలో మొత్తం 1412 మంది ఓటర్లు ఉన్నారని వీరిలో పురుషులు 672 మంది, స్త్రీ లు 740 మంది ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రం 23/1 లో మొత్తం 706 మంది ఓటర్లు లో 345 పురుషులు , 361 స్త్రీ ఓటర్లు , 23/2 పీఎస్ పరిధిలో మొత్తం 706 మంది ఓటర్లు లో 327 పురుషులు, 379 స్త్రీలు ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ వారి తదుపరి ఆదేశాల మేరకు 23 వ వార్డు కి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని మునిసిపల్ కమిషనర్ సుధాకర్ తెలిపారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారి, అదనపు ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారులను, రిజర్వు అధికారులను గుర్తించి ఎన్నికల కమిషన్ కి, జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలతో కూడిన నివేదిక సమర్పించామన్నారు.
Tags kovvuru
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …