యూనివ‌ర్సిటీ అధ్యాప‌కుల‌కు కనీస టైం స్కేల్ అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది… : ప్రొఫెస‌ర్ హేమ చంద్రారెడ్డి

-గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 24 అమలులో గందర గోళంతోనే జాప్యం..
-జీవో నెంబర్ 40 తీసుకొచ్చి ఈ ప్ర‌భుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ఆలోచన చేస్తుంది.
-కొంత‌మంది కోర్టుల‌కు వెళ్ల‌డంతో అమలులో జాప్యం..
-కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు ఎవ‌రినీ తొల‌గించం.. అపోహ‌లు న‌మ్మ‌వ‌ద్దు ః స‌తీష్ చంద్ర‌
-అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను ఆప్కాస్ ద్వారా పార‌ద‌ర్శ‌కంగా నియామ‌కాలు చేస్తున్నాం.
-కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధ్య‌త ప్ర‌భుత్వానిదే.
-వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో ఏపీపీఎస్సీ ద్వారా 2000 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల నియామ‌కం.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనివ‌ర్సిటీ అధ్యాప‌కుల‌కు కనీస టైం స్కేల్ అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. గత ప్ర‌భుత్వం ఇచ్చిన జీవో 24 అమలులో గందరగోళంతోనే జాప్యం జ‌రుగుతుంద‌ని… 2015 రివైజ్డ్ పే స్కేల్స్ ప్ర‌కారం అధ్యాప‌కుల‌కు క‌నీస టైం స్కేల్ ఇవ్వాల‌ని 2019లో జారీ చేసిన జీవో 24లో చెప్పార‌ని.. అయితే యూనివ‌ర్సిటీలోని ఉద్యోగుల‌కు దీనిని ఎలా వ‌ర్తింప చేయాల‌నే విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని, యూనివ‌ర్సిటీ ఉద్యోగుల‌కు యూజీసీ స్కేల్ అప్లై అవుతాయ‌ని.. అయితే ఈ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జీవో నెంబ‌ర్ 40 తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ఆలోచ‌న చేస్తుంద‌ని ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ ఛైర్మన్ ప్రొఫెస‌ర్ హేమ చంద్రారెడ్డి వెల్ల‌డించారు. ఈ విషయంలో ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా చర్చిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కనీస టైం స్కేల్ కి కట్టుబడి ఉందని హేమచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంగ‌ళ‌గిరిలోని ఏపీఎస్ఈహెచ్ఈ కార్యాల‌యంలోఛైర్మ‌న్ హేమచంద్రారెడ్డి, ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌తీష్ చంద్ర మీడియాతో మాట్లాడారు.

జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కనీస టైం స్కేలు సక్రమంగా అమలు చేస్తున్నప్పటికీ యూనివర్సిటీ స్థాయిలో అమలు చేయడం లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రొఫెసర్ హేమ చంద్రారెడ్డి తెలిపారు. గతంలో యూనివర్సిటీ నియామకాల్లో ఒక క్రమపద్దతి పాటించకపోవడం వల్ల సమస్యలు తల్లెత్తున్నాయన్నారు. ప్రభుత్వం, ఆర్థికశాఖ అనుమతి లేకుండా చేసే నియామకాలు చెల్లవని హేమ చంద్రారెడ్డి తెలిపారు. ఒక కమిటీ లేదా నిర్థిష్ట నిబంధనల మేరకు యూనివర్సిటీల్లో నియామకాలు జరగలేదన్నారు. కొన్ని పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉన్నప్పటికీ మరికొన్ని యూనివర్సిటీల సెల్ప్ ఫైనాన్స్ పోస్టులు.. రాష్ట్రంలో 16 యూనివర్సిటీలలో 2100 కాంట్రాక్ట్ పోస్టులు ఉండగా.. వాటిలో ప్రభుత్వ అనుమతి పొందినవి ఎన్ని..? సెల్ప్ ఫైనాన్డ్ పోస్టులు ఎన్ని అనే విషయంపై క్లారిటీ లేదన్నారు. ఈ నియామకాలన్నీ ఒక క్రమపద్దతి ప్రకారంప్రభుత్వ, ఆర్ధికశాఖ అనుమతి పొంది.. రోస్టర్ ను అనుసరించి నియామకాలు జరుగుతాయ‌న్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో నియామకాలు ఏపీపీఎస్సీ ద్వారా నియాయమ‌కాలు జ‌రుగుతాయ‌న్నారు. మినిమమ్ పే స్కేల్ అప్లై చేయడానికి కచ్చితమైన విధివిధానాలు లేవ‌న్నారు. అదికవి నన్నయ్య, జేఎన్టీయూ (కాకినాడ), జేఎన్టీయూ(అనంతపూర్) యూనివర్సిటీల్లో ఉద్యోగులకు ఇప్పటికే 39వేల వరకూ శాలరీలు పెంచామని, కాంట్రాక్ట్ లెక్చరర్లకు అన్నిచోట్ల ఒకే విధంగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 2వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ లతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కనీస వేతన స్కేల్ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అయితే యూనివర్సిటీలు గతంలో రూల్స్ పాటించకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుందని అన్నారు.

కనీస టైం స్కేల్ విషయంలో కొంత మంది ఉద్యోగులు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేక పోతోందని ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ జీతాలు పెంచడంలో ప్ర‌భుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఒక్కో యూనివర్సిటీలో జీతాలు ఒక్కోరకంగా ఉన్నాయన్నారు. కొన్ని యూనివర్సిటీలో 40000 జీతం ఇస్తున్నార‌ని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో ఒక ప్రకటన ఇవ్వడం గానీ, ఒక క‌మిటీ వేసి ఒక పద్ధతిగా నియామ‌కాలు జ‌ర‌ప‌లేదని తెలిపారు. ఎయిడెడ్ స్టాప్ యూనివర్సిటీ వాళ్ళు తీసుకుంటున్నార‌నే అపవాదు వేయడం సరికాదన్నారు. ఎయిడెడ్ సిబ్బందిలో 700 నుంచి 800 మంది ఉండగా వారిలో 300 మంది మాత్రమే యూనివ‌ర్సిటీల‌కు అర్హత కలిగి ఉన్నారన్నారు. ప్ర‌భుత్వ జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌కారం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వం 2000 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియామ‌కం చేయనుంద‌ని.. దీనిలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న వారు కూడా పాల్గొని ప్ర‌భుత్వం ఉద్యోగం పొంద‌డానికి ఇది మంచి అవకాశం అని ఆయ‌న పేర్కొన్నారు. ఉద్యోగ నియామ‌కాల‌న్నీ ప్ర‌భుత్వం పారదర్శకంగా చేపడుతుంద‌న్నారు.. కాంట్రాక్ట్ లెక్చరర్లు ఈ నిర్ణయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని పోటీపరీక్షల్లో లో విజయం సాధించవచ్చని ఆకాంక్షించారు. కాంట్రాక్ట్ స్టాప్ నియామ‌కాల‌ విషయంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఎక్క‌డా కూడా సుప్రీంకోర్టు తీర్పుల ప్ర‌కారం ఏ కాంట్రాక్ట్ ఉద్యోగిని రెగ్యుల‌ర్ చేయ‌డానికి అవ‌కాశం లేద‌ని తెలిపారు. గతంలో ఎజెన్సీల ద్వారా నియామ‌కాలు జ‌ర‌గ‌డం ద్వారా అవినీతి జ‌రిగేద‌ని.. జీతాలు త‌క్కువ‌గా ఇచ్చేవారని చెప్పారు. గ‌తంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏ ఉద్యోగ‌ భద్రత ఉండేది కాదన్నారు. నేడు ఆప్కాస్ ద్వారా వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమయానికి వేతనాలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సేవలు కూడా అందిస్తున్నామన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌ని, దాని గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స‌తీష్ చంద్ర తెలిపారు.

ఈ ప‌త్రికా విలేక‌ర్ల స‌మావేశంలో వైస్ ఛైర్మ‌న్లు కె. రామ్మోహ‌న్ రావు, టి. ల‌క్ష్మ‌మ్మ‌, సెక్ర‌ట‌రీ బి. సుధీర్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *