మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్రమ మద్యం, నాటుసారా తయారీ తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. అక్రమ మద్యం నిర్మూలన, జీఎస్టీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ అక్రమ మద్యం, నాటు సారా తయారీ, అమ్మకాలను పూర్తిస్థాయిలో అడ్డుకోవాలన్నారు. పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారిని బైండోవర్ చేయడంతో పాటు పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి అక్రమ మద్యం రవాణా, సారా తయారీ, అమ్మకాల నిర్మూలనకు జిల్లా స్థాయిలో పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. కె. మాధవీలత , జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశిల్ , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …