-31వ తేదీన స్టీల్ ప్లాంట్ దగ్గర సభ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తమ పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు 31వ తేదీన పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. 31వ తేదీ మధ్యాహ్నం 2గం.కు సభ ప్రారంభమవుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ ఉక్కు పరిరక్షణ సమితి పోరాడుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అంశంపై తొలుతనే స్పందించి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన నాయకుడు శ్రీ పవన్ కల్యాణ్ గారే. ఫిబ్రవరి 9వ తేదీన పవన్ కల్యాణ్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయాన్ని కేంద్రానికి తెలియచేస్తూ, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని వినతి పత్రం అందించిన విషయం విదితమే. 34 మంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందనే విషయాన్ని ఈ సందర్భంగా అమిత్ షా కి తెలియచేశారు. జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పి. హరి ప్రసాద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.