Breaking News

విద్యార్థులకు ఫైలేరియా వైద్య పరీక్షలు…

-బోధ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ బోధవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్మిషన్ ఎస్సైన్మెంట్ సర్వే ఈ నెల 22 నుండి 30 తేదీ వరకు కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం అయోధ్య నగర్ లోని శ్రీ శారద విద్యా నిలయంలో ఆరు నుండి ఏడు సంవత్సరాల విద్యార్థులకు ఫైలేరియా కిట్ ద్వారా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వ్యాధి గురించి తెలియజేస్తూ ఈ బోధ వ్యాధి శరీరంలో ఏ అవయవానికి అయినా రావచ్చునని ముఖ్యంగా ఇది కాలు కి వస్తుందని తెలియజేశారు. ప్రారంభంలో ఈ బోధవ్యాధి గుర్తిస్తే తగిన వైద్యం తీసుకోవడం ద్వారా దాన తగ్గించుకోవచ్చని తెలియజేశారు. ఈ వ్యాధి క్యూలెక్స్ ఆడ దోమ కుట్టడం ద్వారా వస్తుందని, ఇది మురికి నీటిలో వృద్ధి చెందుతుందని, కాబట్టి ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా దోమలు వృద్ధి అరికట్టుట ద్వారా బోధ వ్యాధి నిర్మూలించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సబ్ యూనిట్ ఆఫీసర్ రాజాం రాజు, డాక్టర్ భవ్య, హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావు, వివిఎస్ఎన్ బాబు, బి రవి కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ వై శ్రీధర్, శారద విద్యాలయం హెడ్ మాస్టర్ ఎన్ నారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *