మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని మచిలీపట్నం రెవిన్యూ డివిజినల్ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల ఆధికారి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు జె. నివాస్ సూచనల మేరకు ఎస్ వి ఈ ఈ పీ ( సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రో ల్ పార్టిసిపేషన్ ) నిర్వహణలో భాగంగా 01-11-2021 నుండి ప్రారంభమయ్యే ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ-2022 కార్యక్రమo పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం స్థానిక తహశీల్ధార్ కార్యాలయం నుండి మచిలీపట్నం బస్టాండ్ కూడలి వరకు వివిధ శాఖల ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రజల అవగాహన కొరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో ఖాజావలి మాట్లాడుతూ, 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్క పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని, ఓటు విలువ, ఓటు యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు సవివరంగా వివరించాలని కోరారు. అతి పెద్దదైన మన ప్రజాస్వామ్య దేశంలో ఓటు యొక్క విలువ ఎంతో కీలకం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆశిస్తున్నారో వారు సమీపంలోని బూత్ స్థాయి అధికారిని లేదా తహశీల్ధార్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు వయసు నిండుతున్న వారంతా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అలాగే చిరునామా, పేర్లలో మార్పులు చేర్పులకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని ఫారం-6 కొత్త ఓటరు నమోదుకు, ఫారం-7 జాబితాలో మార్పులకు, ఫారం-8 పోలింగ్ బూత్ మార్పుల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ లోకి వెళ్లి సంబంధిత దరఖాస్తును పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన ఆధార్ కార్డు, పుట్టినరోజు ధ్రువీకరణ పత్రం, పదో తరగతి సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్ పోర్టు ఫొటోలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని ఆ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పత్రాలను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల విభాగంలో అందజేయాలి. బూత్ లెవల్ అధికారి దరఖాస్తుదారుడి నివాసానికి వెళ్లి విచారణ నిర్వహించి..అర్హులను ఓటరుగా గుర్తిస్తారన్నారు . ఆ తర్వాత ఓటు గుర్తింపు కార్డులను మీ సేవ కేంద్రాల ద్వారా పొందవ చ్చని ఆర్డీవో ఖాజావలి తెలిపారు.
అనంతరం తహశీల్దారు సునీల్ మాట్లాడుతూ ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించి ,01. 11. 2021 నుండి ప్రారంభమయ్యే ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ-2022 కార్యక్రమoలో 01. 01. 2022 నాటికీ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ ఓటర్లగా నమోదు చేసుకోవచ్చున్నారు.
ఈ ర్యాలీలో డెప్యూటీ తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి, మచిలీపట్నం నియోజకవర్గ ఎన్నికల ఎన్నికల సంఘ ఉద్యోగులు రెవిన్యూ ఇన్స్పెక్టర్లు యాకూబ్ , వనజాక్షి , పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …