ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిజీ శుక్రవారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, శ్రీ దుర్గమ్మ వారి ఆలయమునకు విచ్చేయగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ డా. జి.వాణీ మోహన్, IAS, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, పాలక మండలి సభ్యులు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ వారు శ్రీ అమ్మవారిని దర్శనము చేసుకొని, పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఆలయ పాలక మండలి చైర్మన్, కార్యనిర్వహణాధికారి మరియు వైదిక కమిటీ సభ్యులు, ప్రధానార్చకులు స్వామీజీ వారికి పూలు పండ్లు ప్రసాదములను సమర్పించగా, స్వామీజీ వారు అందరికీ అనుగ్రహభాషణం చేశారు. అనంతరం దేవస్థానం నందు శ్రీ అమ్మవారి ఆలయ సంక్షిప్త స్థలపురాణం ను దృశ్య రూపంలో తెలియజేయు నిమిత్తం ఏర్పాటు చేసిన ఆగ్మెంటేడ్ రియాలిటీ బోర్డు లను స్వామీజీ వారు ఆవిష్కరించారు.ఈ యాప్ ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో “kanaka durga AR” అను యాప్ ను డౌన్లోడ్ చేసుకొని, ఈ యాప్ ద్వారా బోర్డులోని చిత్రమును స్కాన్ చేయినట్లయితే మొబైల్ నందు శ్రీ అమ్మవారి ఆలయ సంక్షిప్త స్థలపురాణం వీడియో రూపములో తెలియజేయబడును..
Tags indrakiladri
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …