విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలో పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ గారిని కోరినట్టు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కమిషనర్ ని కలిసిన అవినాష్ ఈమేరకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా వెటర్నరీ కాలనీ అభివృద్ధి కొరకు కాలనీ అసోసియేషన్ వారు అందజేసిన 5లక్షల రూపాయల చెక్కును కమిషనర్ కి అందజేశారు మరియు 21వ డివిజన్ సమస్యలు గురుంచి స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారి వినతిపత్రం అందజేశారు.సానుకూలంగా స్పందించిన ఆయన వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయుకులు గల్లా రవి మరియు వెటెనరీ కాలనీ అసోసియేషన్ సభ్యులు నల్లూరి సుబ్బారావు, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …