Breaking News

జిల్లా పర్యటన ముగించుకుని విశాఖపట్నం బయలుదేరిన ఉపరాష్ట్రపతి…

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాలో నాలుగు రోజుల పర్యటన అనంతరం ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మంగళవారం విశాఖపట్నం బయకుదేరి వెళ్లారు. గన్నవరం నుండి ఎయిర్ ఫోర్స్ కి చెందిన ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావులు వీడ్కోలు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, రాష్ట్ర ఆదనవు పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ జె నివాస్ , ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, నూజివీడు ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి , ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *