-ఈ నెల 13, 14 తేదీల్లో ఎనికేపాడు, తాడిగడలోని కెఎంవి వివాన్‌లో నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా మొక్కలను విస్త్రతంగా పెంచాలనే ఉద్దేశంతో ఇంటిలో మనం పెంచుకునే ప్రతి మొక్కను బోన్నాయి మొక్కగా తీర్చిదిద్దేలా నగర ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వివిధ బోన్సాయి మొక్కల ప్రదర్శనను నగరంలోని ఎనికేపాడులో శని, ఆదివారాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు అమరావతి బోన్సాయి సొసైటి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అఖిలాండేశ్వరి రాణి టి, వెంకటేష్ వై తెలిపారు. ఎనికేపాడులోని కె.ఎం.వి. వివాన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలాండేశ్వరి రాణి టి, వెంకటేష్ వై మాట్లాడుతూ… భవిష్యత్తులో పర్యవరణానికి విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో బోన్సాయి మొక్కలను మనం పెంచగలిగితే కొంతవరకు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. బోన్సాయ్ మొక్కల ప్రదర్శన శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, అలాగే 14న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బోన్సాయి మొక్కల పెంపకం పట్ల అవగాహన కల్పించడంతో పాటు పలు వర్క్‌షాపులను ఏర్పాటు చేయడం ద్వారా వివిధ రకాల మొక్కలను బోన్సాయి మొక్కగా ఏ విధంగా తీర్చిదిద్దుకోవచ్చో ప్రజలకు మొక్కల పెంపకం, సంరక్షణ నిపుణులతో వివరిస్తామని తెలిపారు. మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతాయి.. మొక్కలను సంరక్షించండి.. అనే నినాదంతో అమరావతి బోన్సాయి సొసైటి కమిటి విజయవాడలో ఏర్పాటైందని చెప్పారు. ప్రధానంగా సొసైటి ముఖ్య ఉద్దేశం బోన్సాయి మొక్కల పెంపకం పట్ల అవగాహన కల్పించడమేనన్నారు. బోన్సాయి మొక్కల పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలిపారు. కె.ఎం.వి. వివాన్ అసోసియేషన్, కె.ఎం.వి. స్పేసస్ సహకారంతో నిర్వహిస్తున్న బోన్సాయి మొక్కల అవగాహన ప్రదర్శనను శనివారం ఉదయం కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే మొక్కల పెంపకంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సభ్యత్వాలను చేర్చువడం ద్వారా వారికి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో అమరావతి బోన్సాయ్ అసోసియేషన్ అధ్యక్షులు అమృతకుమార్, ఉపాధ్యక్షురాలు యెర్నేని పద్మజ, కార్యదర్శి పత్తి నాగలక్ష్మి, జాయింట్ సెక్రటరీ గామిని సునీత, కోశాధికారి దుర్గా సౌజన్య కంచర్ల, కె.ఎం.వి. స్పేసస్ డైరెక్టర్ కె.పృధ్వీరామ్, కె.ఎం.వి. స్పేసస్ మార్కెటింగ్ హెడ్ ప్రసాద్ వల్లూరి, మొక్కల ప్రేమికులు, తదితరులు పాల్గొన్నారు.