-జగనన్న పాలవెల్లువ యాప్ లో పాడి రైతుల నమోదు పై వాలెంటీర్లకు శిక్షణ అందిస్తున్నాం..
-జాయింట్ కలెక్టరు (అభివృద్ది) శివశంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల్లో పాడి రైతులకు మేలు చేసే సహకార సంస్థ తిరిగి బలోపేతం చేసేందుకు జగనన్న పాలవెల్లువ దోహదపడుతుందని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివశంకర్ అన్నారు. నగరంలో జాయింట్ కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జగన్న పాలవెల్లువ అమలు పై జాయింట్ కలెక్టరు శివశంకర్ గురువారం పశుసంవర్థక శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జగన్న పాలవెల్లువ కింద్ర నూజివీడు, ఉయ్యూరు, నందిగామ క్లస్టర్లుకు సంబందించి 26 మండలాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు నూజివీడు, ఉయ్యూరు, నందిగామ క్లస్టర్లుకు సంబందిన వాలెంటీర్లకు జగన్న పాలవెల్లువ పై ఇంటింటి సర్వే చేసి పాడి పశువుల యజమానులు(మహిళలు)ను రిజిష్టరు చేసి యాప్ నందు అప్లోడ్ చేయు విదానాన్ని శిక్షణ అందించే విధంగా పశు సంవర్థక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వాలెంటీర్లు ఈ నెల 13 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి ప్రభుత్వం రూపొందించిన యాప్ నందు లబ్దిదారులను వివరాలను అప్ లోడ్ చెయ్యాలన్నారు. అందుకు సంబందించి యాప్ నందు అప్లోడ్ చేయు విదానపై శిక్షణను అందిస్తారన్నారు. మహిళా రైతులే కాకుండా గ్రామాల్లో ఉన్న ఇతర మహిళా పాడి రైతులను యాప్ నందు నమోదు చెసే విదంగా వాలంటీర్లకు పూర్తి స్థాయి శిక్షణను అందించాలన్నారు. యాప్ నందు వాలంటీర్ తప్పని సరిగా ప్రతి పార్మర్ వివరాలను సేకరించాలి. ఆ మహిళా రైతుకు కనీసం ఒక పాలు ఇచ్చే పశువు ఉండాలి. ప్రతి పార్మర్ వివరాలు మీ క్లస్టర్ పరిధిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది. ఆయా గ్రామాల్లోని ఆర్బీకే, ఆదార్ నెంబరు, పేరు, మొబైల్ బ్యాంక్ కోడ్ మరియు పశువుల వివరాలను యాప్ నందు నమోదు చేయాల్సిన పూర్తి స్థాయి ప్రక్రియను వాలంటీర్లకు శిక్షణ ద్వారా అందించాలని ఆధికారులను ఆదేశించారు. మహిళ పాడి రైతుల ప్రయోజనం కోసం చేపట్టిన సహకార డెయిరీ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జగనన్న పాలవెల్లువ వలన మహిళ పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జాయింట్ కలెక్టరు శివశంకర్ అన్నారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ జాయింట్ డైరక్టరు విద్యసాగర్, అసిస్టెంట్ డైరక్టరులు పాల్గొన్నారు.