Breaking News

కొవ్వూరులో నవంబర్ 14 నుంచి 20 వరకు 54వ గ్రంథాలయ వారోత్సవాలు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబర్ 14 నుంచి 20 వరకు 54వ గ్రంథాలయ వారోత్సవాలను కొవ్వూరులో నిర్వహించనున్నట్లు కొవ్వూరు శాఖ గ్రంథాలయాధికారి జి.వి.వి.ఎన్. త్రినాధ్ శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. గ్రంధాలయ వారోత్సవాలను కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రధమ శ్రేణి శాఖా గ్రంధాలయం, కొవ్వూరులో ప్రారంభించడం జరుగుతుందని త్రినాథ్ పేర్కొన్నారు. 14న బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న స్వాతంత్ర్య పోరాటం & జాతీయ స్వాతంత్ర్య యోదులపై ప్రముఖుల ప్రసంగాలు, 17న స్థానిక స్వాతంత్య్ర సమర యోధుల ప్రసంగాలు, 18న స్వాతంత్య్ర ఉద్యమంపై వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, 19న మహిళా దినోత్సవ కార్యక్రమం, 20న అక్షరాస్యతా దినోత్సవం, గ్రంధాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలో గెలుపు పొందిన విద్యార్థిని విద్యార్థులకు వారోత్సవాలు ముగింపు సందర్భంగా బహుమతులు అందచేస్తామన్నారు

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *