-నగరంలో షాహితాజ్ బిర్యాని హౌస్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన బిర్యానీ లను నగరవాసులకు అందిస్తున్నారని డివిజన్ కార్పోరేటర్ కే. మల్లేశ్వరి తెలిపారు. శుక్రవారం బి.ఆర్.టీ.యస్ ఫుడ్ జంక్షన్ సమీపంలోని సంగీత కళాశాల దగ్గర షాహితాజ్ బిర్యాని హౌస్ ను 27వ డివిజన్ కార్పొరేటర్ మల్లేశ్వరి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరవాసులకు సరిక్రొత్త రుచులుతో షాహితాజ్ బిర్యాని హౌస్ ను ప్రారంభించారని తెలిపారు. ఈ బిర్యానీ సెంటర్ దినాభివృద్ధి చెందుతూ నగరంలో మరిన్ని షాహితాజ్ బిర్యాని సెంటర్ లు ప్రారంభించాలని ఆకాక్షించారు.షాహితాజ్ బిర్యాని హౌస్ అధినేత అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ నగరవాసులకు సరిక్రొత్త రుచులుతో అనేక రకాల బిర్యానీలను అందిస్తున్నామన్నారు. తమకు నగరంలో రెండు బ్రాంచులు ఉన్నాయని అతి తక్కువ ధరలతో నగరవాసులకు పసందైన అనేక రకాల బిర్యానీలను అందజేస్తున్నామని తెలియజేశారు. త్వరలో నగరవాసులకు హోమ్ పార్సిల్ వెసులుబాటును కల్పిస్తున్నామని తెలిపారు.