ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. “గ్రీవెన్స్ డే” నిర్వహణలో భాగంగా APCRDAలోని వివిధ విభాగాల అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(SDC)లతో కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ గారు సమీక్ష నిర్వహించారు. వారి విభాగాలలో పలు అంశాలపై చర్చించి..నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు.

రాజధాని రైతులు, గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ IAS, కొల్లాబత్తుల కార్తీక్ IAS గార్లకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలియజేశారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయానుసారం ఉంటుందన్నారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్(సీజీసీ) వద్ద ప్రతి రోజూ పనివేళలలో CRDA సిబ్బంది అర్జీలు స్వీకరిస్తారని..ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” జరుగుతుందన్నారు. నేడు నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 42 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

అదే విధంగా “గ్రీవెన్స్ డే” నిర్వహణతో పాటు రాజధాని రైతుల NPCI/ బ్యాంక్ లింకేజి సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకుగాను APCRDA ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్‌లోని APCRDA సిబ్బంది..పలువురు రైతులకు NPCI లింకేజి ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో ఆయా రైతుల ఖాతాలలో వార్షిక కౌలు జమ కానుంది.

గ్రీవెన్స్ డేలో APCRDA గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్‌మెంట్(GRM) నోడల్ అధికారి పి.జయశ్రీ, ఇంజినీర్-ఇన్- చీఫ్ ఆర్. గోపాలకృష్ణారెడ్డి, సోషల్ డెవలప్మెంట్ గ్రూప్ డైరెక్టర్ వి.రాములు, డైరెక్టర్, ల్యాండ్స్ – క్యాపిటల్ రీజియన్ బి.ఎల్. చెన్నకేశవరావు, సర్వే విభాగ డిప్యూటీ డైరెక్టర్ జి.పాండురంగ రామకృష్ణన్, ప్లానింగ్ డైరెక్టర్ FAC బి. సురేష్ కుమార్, డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగ డైరెక్టర్ FAC వి.సునీత, IT విభాగ అడిషనల్ డైరెక్టర్ కుష్వంత్, కమ్యూనికేషన్స్ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జి. వెంకటేష్, ఎం.శేషిరెడ్డి, జి, భద్రు, కె.ఎస్.భాగ్యరేఖ, పి. పద్మావతి, బి. సాయి శ్రీనివాస నాయక్, , కె.సుధారాణి, , జి. సూర్యనారాయణ రెడ్డి, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎస్సీ, ఎస్టీ అంత్రపెన్యూర్స్ సమస్యల పరిష్కారానికి కృషి

-రేపు సంబంధిత శాఖల కార్యదర్శులతో పవన్ కళ్యాణ్ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ అంత్రపెన్యూర్స్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *